Site icon NTV Telugu

మెగా అప్డేట్ : “భోళా శంకర్” ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

Bholaa Shankar Pooja ceremony on November 11th at 7:45 AM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్‌” రూపొందనున్న విషయం తెలిసిందే. సిరుతై శివ దర్శకత్వంలో అజిత్ కుమార్, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ యాక్షన్ డ్రామా ‘వేదాళం’ రీమేక్. ఇందులో చిరు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈరోజు ఉదయం సినిమాకు సంబంధించిన మెగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు సినిమా ముహూర్తం, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు “భోళా శంకర్” బృందం ప్రకటించింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుండి ప్రారంభమవుతుంది. ఎక్కువ భాగం షూటింగ్ కోల్‌కతాలో జరుగుతుంది. చిరంజీవి సరసన జతకట్టనున్న హీరోయిన్ పేరును త్వరలో ప్రకటిస్తారు. ఈ సినిమాలో చిరంజీవి మళ్లీ మాస్ హీరోగా కనిపించనున్నారు. యువ సంగీత స్వరకర్త మహతి స్వర సాగర్ “భోళా శంకర్” కోసం సౌండ్‌ట్రాక్‌లను అందించనున్నారు. అగ్ర నిర్మాత అనిల్ సుంకర క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌నునిర్మిస్తున్నారు.

Rea Also : రికార్డు బ్రేకింగ్ ధర కు “రాధేశ్యామ్” డిస్ట్రిబ్యూషన్ రైట్స్

Exit mobile version