Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కోలీవుడ్ లో రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న వేదాళం కు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మెహర్ రమేష్. ఇకపోతే ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేసిన టీమ్.. మరో షెడ్యూల్ కోసం కోల్ కత్తా బయల్దేరింది. చిరంజీవి, మెహర్ రమేష్.. ప్రత్యేక విమానంలో కోల్ కత్తా వెళ్తున్న ఫొటోస్ ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఫొటోస్ లో చిరు లుక్ ఆకట్టుకుంటుంది. గడ్డం, గ్లాసెస్, క్యాప్ పెట్టుకొని యంగ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఇక దూరం నుంచి చూస్తే .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యేమో అన్నట్లు ఉన్నాడు. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. సినిమాలో ఈ రేంజ్ లోనే చిరు కనిపిస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు.
Naga Chaitanya: ఏమున్నాడురా బాబు.. మన్మథుడే మురిసిపోయేలా
ఇప్పటికే మే డే రోజు రిలీజ్ చేసిన పోస్టర్స్ లో చిరు.. వింటేజ్ లుక్ లో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు కూడా అదే లుక్ లో కనిపిస్తున్నాడు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక మెగా అభిమానులు అయితే హైప్.. ఇంకా ఇవ్వండి.. సినిమా సూపర్ హిట్ అవ్వాలి.. అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా చిరుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా తరువాత చిరు .. కుర్ర డైరెక్టర్ల సినిమాల్లోనే నటించనున్నాడని టాక్ నడుస్తోంది. భోళా శంకర్ షూటింగ్ పూర్తికాగానే చిరు తన కొత్త సినిమాను అనౌన్స్ చేస్తారని టాక్ .. మరి ఆ కుర్ర డైరెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.