Bhola Shankar Stay Case at Court: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా అనుకోకుండా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల నిలిపివేయాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో విశాఖపట్నంకి చెందిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ అలియాస్ వైజాగ్ సతీష్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఆ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారని వైజాగ్ సతీష్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు నమోదు చేశారు. ఇక ఈ సినిమా వివాదం మీద హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇరు పక్షాల మధ్య జరిగిన వాదోపవాదాలు ముగియగా తీర్పు గురువారం వెలువరిస్తానని న్యాయమూర్తి వెల్లడించారు.
Mahesh Babu: మహేష్ బాబు గురించి ఈ ఐదు విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..?
ఏజెంట్ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులు మూడు రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కు సంబంధించి ఐదు సంవత్సరాల పాటు తనకు చెందిన గాయత్రీ దేవి ఫిలిమ్స్ అనే సంస్థకు ఇస్తానని అగ్రిమెంట్ రాసిచ్చారని అందుకుగాను తన వద్ద 30 కోట్ల రూపాయలు తీసుకున్నారని వెల్లడించారు. అయితే అగ్రిమెంట్ ప్రకారం హక్కుల ఇవ్వకుండా కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే హక్కులు రాసిచ్చారని ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో భోళా శంకర్ సినిమా విడుదలకు ముందు చెల్లిస్తామని చెప్పారని అందుకు సంబంధించి లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ కూడా ఇచ్చి ఇప్పుడు సమాధానం చెప్పడం లేదని వైజాగ్ సతీష్ వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయం కోసం కోర్టు దాకా వచ్చానని ఆయన వెల్లడించారు.