Site icon NTV Telugu

Chiru: భోళా శంకర్ వస్తున్నాడు… ఇక ‘మెగా ఫెస్టివల్’ గ్యారెంటీ

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ లని మరిపిస్తూ ఇది కదా మెగా స్టార్ రేంజ్ అనిపిస్తూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. వింటేజ్ చిరుని చూపిస్తూ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతి రిజల్ట్ ని మరోసారి రిపీట్ చేయడానికి రెడీ అయిన చిరు ప్రస్తుతం మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నాడు. తమిళ వేదాలమ్ సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్, చిరుకి చెల్లి పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 11న రిలీజ్ కానున్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ‘భోళా మేనియా’ సాంగ్ ని రిలీజ్ చెయ్యనున్నారు.

ఈ సాంగ్ తో మెగా ఫెస్టివల్ ని  స్టార్ట్ చేయడానికి మహతి స్వర సాగర్ రెడీగా ఉన్నాడు. జూన్ 4న రిలీజ్ కానున్న భోళా మేనియా సాంగ్ ప్రోమోని జూన్ 2న రిలీజ్ చెయ్యనున్నారు. ఈ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చిరు మస్త్ ఉన్నాడు. ఆ స్టైల్ అండ్ స్వాగ్ ఎన్ని ఏళ్లు అయినా మెగాస్టార్ నుంచి పోదు  నిజం చేసేలా ఈ పోస్టర్ ఉంది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ భోళా మేనియా సాంగ్ లో సూపర్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మరి శేఖర్ మాస్టర్ స్టెప్స్, చిరు గ్రేస్, మహతి స్వర సాగర్ కంపొజిషన్ అన్నీ కలిసి ‘భోళా మేనియా’ సాంగ్ ని ఎంత స్పెషల్ గా మార్చనున్నాయో చూడాలి.

Exit mobile version