Bhojpuri actress:భోజ్ పురి ఇండస్ట్రీలో దారుణం చోటుచేసుకొంది. హర్యానాలోని గురుగ్రామ్‌లో భోజ్‌పురి నటికి సినిమాలో పాత్ర ఇప్పిస్తానని చెప్పి ఆమెపై అత్యాచారం చేసిన ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే భోజ్ పురి ఇండస్ట్రీలో నటిగా ఎదుగుతున్న ఆమెకి ఇన్స్టాగ్రామ్ ద్వారా మహేష్ పాండే అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఒక యూట్యూబ్ నడుపుతున్నానని, ఇంటర్వ్యూ చేసి ఫేమస్ చేయిస్తాను అని.. అవకాశాలు కూడా ఇప్పిస్తాను అని నమ్మబలికాడు. ఇక అతడి కల్లబొల్లి కబుర్లు నమ్మిన నటి.. జూన్ 29న ఉద్యోగ్ విహార్ ప్రాంతంలోని ఓ హోటల్‌కు వెళ్ళింది. అక్కడ మహేష్ పాండే అప్పటికే మద్యం సేవిస్తూ ఉన్నాడు. ఇంటర్వ్యూ మొదలుపెడతానని చెప్పి.. ఆమెను కూర్చోపెట్టి కొడిసేపు మాట్లాడాడు. అనంతరం ఆమెను బెడ్ పైకి నెట్టి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.
Vaishnavi Chaitanya: బిగ్ బాస్ లోకి ‘బేబీ’.. ఏం మాట్లాడుతున్నార్రా.. నరాలు కట్ అవుతున్నాయి
ఇక అతడి ప్రవర్తన తెలిసిన సదురు నటి.. అతగాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసింది. ఇక దీంతో మహేష్ పాండే ఆమెను బెదిరించాడు.. పడుకోవడానికి ఒప్పుకోకపోతే.. దామిని సినిమాలోలా బీర్ బాటిల్ ను ప్రైవేట్ పార్ట్ లోకి దింపినట్లు దింపి.. హత్యచేస్తాను అని బెదిరించి .. అరవడానికి కూడా లేకుండా చేశాడు. ఇక ఆమెపై అత్యాచారం చేసి.. ఆమెను గదిలో బంధించి మహేష్ పాండే పరారయ్యాడు. ఆ షాక్ నుంచి బయటపడిన నటి.. జూలై 19 న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగ్ విహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 376, 506, 509, 34 కింద కేసు నమోదు చేసి.. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా తెలియని వారు హోటల్ కు రమ్మని పిలిస్తే వెళ్లవద్దని అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు.