NTV Telugu Site icon

Priyanshu Singh: పునీత్ నన్ను రెండు సార్లు బలవంతంగా అత్యాచారం చేశాడు.. నటి సంచలన వ్యాఖ్యలు

Puneetha

Puneetha

Priyanshu Singh: ఇండస్ట్రీలో హీరోయిన్లు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఇక కొంతమంది హీరోయిన్లు అపరిచితులు గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. తాజాగా.. భోజ్ పురి నటి.. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తిని నమ్మి.. అతడిని నటుడిగా చేసి.. చివరికి అతని చేతిలోనే మోసపోయింది. ఆమె పేరు ప్రియాంషు సింగ్. భోజ్ పూరి లో పలు చిత్రాల్లో మంచి మంచి పాత్రల్లో నటించి మెప్పించిన ప్రియాంషు.. తన సహా నటుడు పునీత్ సింగ్ తనను నమ్మించి రెండుసార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. అతడిపై కేసు నమోదు చేసి.. అతడిని అరెస్ట్ చేయాలనీ ఆమె డిమాండ్ చేసింది. ఆమె చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

Pawan Kalyan: ఎట్టకేలకు పవన్- సురేందర్ సినిమా మొదలు.. ఆ రీమేక్ యేనా..?

“నా కెరీర్ మొదలుపెట్టి చాలా ఏళ్ళు అవుతుంది. మంచి పాత్రలతో నేను హ్యాపీగా జీవిస్తున్న సమయంలో సోషల్ మీడియా ద్వారా పునీత్ సింగ్ రాజ్ పుత్ పరిచయమయ్యాడు. మొదట్లో ఎంతో మంచిగా, మర్యాదగా మాట్లాడేవాడు. సినిమాల్లోకి వెళ్లాలని తన కోరిక అని చెప్పాడు. దీంతో నా పరిచయాలతో అతడికి కొన్ని పాత్రలు కూడా ఇప్పించాను. ఇక ఆ తరువాత అతను నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. అలా మా పరిచయం పెరిగింది. అతను మా ఇంటికి రావడం కూడా మొదలుపెట్టాడు. ఇక ఒకరోజు.. రాత్రి ఫుల్ గా మందు కొట్టి మా ఇంటికి వచ్చి.. నన్ను బలవంతంగా అత్యాచారం చేశాడు. నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటే.. కాళ్ళు పట్టుకొని బతిమిలాడాడు. పెళ్లి చేసుకుంటానని, కెరీర్ పాడవుతుంది చెప్పి నా నోరు మూయించాడు. ఆ తరువాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ మధ్యన మరోసారి బలవంతంగా మరోసారి నాపై అత్యాచారం చేశాడు. ఇక తట్టుకోలేక అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు అతనిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. దయచేసి నాకు న్యాయం చేయండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంషు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments