NTV Telugu Site icon

Bhimaa : గోపీచంద్ ఆన్ ట్రాక్.. అంచనాలు పెంచేస్తున్న భీమా ట్రైలర్

Bhimaa Trailer

Bhimaa Trailer

Bhimaa Trailer Looks Promising: హీరో గోపీచంద్ సరైన హిట్ కొట్టి చాలా కాలమే అయింది. దీంతో ఎంతో కేర్ తీసుకుని ఆయన సినిమాలు చేస్తున్నారు. ఇక అలా అయన కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇక త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. టీజర్ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో డోస్ పెంచారు. దీంతో తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక సినిమాలోని ఆధ్యాత్మిక కోణాన్ని చూపిస్తూ ట్రైలర్‌ను కట్ చేసారు. లోక రక్షకుడైన విష్ణు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు, భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు అతను ఇంకెవరో కాదు క్షసులపై యుద్ధం ప్రకటించి క్రూరమైన పోలీసు ఆఫీసర్.

Sundaram Master : హిట్ కొట్టాడుగా.. సుందరం మాస్టర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

ఈ ట్రైలర్‌లో గోపీచంద్‌లోని మరో పాత్రను కూడా పరిచయం చేశారు. ఇక కన్నడలో దర్శకుడిగా ఇప్పటికే నిరూపితుడైన హర్ష ఒక లార్జర్ దాన్ లైఫ్ కథతో వస్తున్నాడు. దానికి మైథలాజికల్ టచ్ కూడా ఇవ్వడం ఆసక్తికరంగ్ ఉంది. ఇక ట్రైలర్ లో గోపీచంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. అతను పోలీసుగా కనికరం లేకుండా కనిపిస్తుండగా, మరో రోల్ లో చాలా భయానకంగా ఉన్నాడు. ట్రైలర్‌లో కథానాయికలు ప్రియా భవానీ శంకర్ మరియు మాళవిక శర్మతో సహా ఇతర పాత్రలను చూపించినప్పటికీ, అందరి దృష్టి గోపీచంద్ యొక్క రెండు పాత్రలపై మాత్రమే ఉండేలా కనిపిస్తోంది. ఇక స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్ మరియు డాక్టర్ రవివర్మ కొరియోగ్రఫీ అందించారు. భీమా చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది.
YouTube video player