Bhimaa: మ్యాచో స్టార్ గోపీచంద్ గత కొన్నేళ్లుగా విజయం కోసం ఆరాటపడుతున్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా కూడా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. గత ఏడాది రామబాణం సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేసినా అది వర్క్ అవుట్ కాలేదు. అయినా కూడా దైర్యం కోల్పోకుండా ఈసారి భీమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కన్నడ దర్శకుడు ఏ.హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
భీమా లో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. గోపీచంద్- పోలీస్ క్యారెక్టర్ డెడ్లీ కాంబో అని చెప్పాలి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. సమ్మర్ లో భీమా సందడి చేయడానికి రానున్నాడు. మహాశివరాత్రి కానుకగా మార్చి 8 న భీమా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. మంటలతో కూడిన యుద్ధ భూమిలో పోలీస్ డ్రెస్ లో సీరియస్ గా గోపీచంద్ నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తుంది. గోపీచంద్ లుక్ ఆకట్టుకొంటుంది. మరి ఈ సినిమాతో గోపీచంద్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలంటే.. మార్చి వరకు ఆగాల్సిందే.
