Bhimaa Producer: అఖండ రిఫరెన్స్.. ‘భీమా’ గూస్ బంప్స్ తెప్పిస్తుంది: నిర్మాత ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhimaa Producer KK Radha Mohan Interview: గోపీచంద్ హీరోగా నటిస్తున్న భీమా సినిమాకి కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత కె కె రాధామోహన్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
అలా మొదలైంది
మా సహా నిర్మాత శ్రీధర్, దర్శకుడు హర్ష ఈ కథతో గోపీచంద్ దగ్గరికి వెళ్లారు. గోపీచంద్ కి కథ చాలా నచ్చింది, ఇంతకుముందు కలిసి పని చేసిన అనుబంధంతో ఆయన నన్ను సజస్ట్ చేశారు. తర్వాత నేనూ కథ విన్నా, చాలా కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి. గోపీచంద్ ఇంతకుముందు పోలీస్ పాత్రలు చేశారు కానీ ఈ పాత్ర చాలా డిఫరెంట్, చాలా కొత్త జోనర్ లో వుండే కథ ఇది. ప్రేక్షకుల ఇలాంటి కథలు గొప్పగా ఆదరిస్తున్నారు. తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది అనే నమ్మకంతో ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాం, కథలో చాలా సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ట్రైలర్ లో పోలీస్ కాకుండా గోపీచంద్ మరో గెటప్ చూసి ప్రేక్షకులు చాలా ఎక్సయిట్ అవుతున్నారు.
Also Read
అఖండ పోలికతో?
‘అఖండ’కి భీమాకి ఏ మాత్రం పోలిక లేదు, భీమాలో చూపించిన పరశురామ క్షేత్రం బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. శివాలయం, అఘోరాలు యాంబియన్స్ కోసం చూపించాం, అఘోరాలకు కథతో సంబంధం లేదు అలాగే కథ, జోనర్ పరంగా ఇది చాలా డిఫరెంట్ మూవీ.
హర్షతో రిస్క్
ప్రతి ప్రాజెక్ట్ నిర్మాతకు రిస్కే, అయితే మనం ముందు కథని నమ్మాలి. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు కథ ఉందా లేదా? ప్రాజెక్ట్ కి సరిపడా నటీనటులు ఎవరు? ఎలాంటి సాంకేతిక నిపుణులు ఎంచుకోవాలని తెలుసుకొని ముందుకు వెళ్ళడమే. హర్ష చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు, కొరియోగ్రఫర్ కూడా. భీమాని చాలా అద్భుతంగా తీశారు. అలాగే ఇందులో రెండు పాటలకు కొరియోగ్రఫీ కూడా చేశారు.
భీమా బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమా కదా ?
నిజమే. ఈ సినిమా మంగళూరు, బాదామి, ఉడిపి, మారేడుమిల్లి, వైజాగ్ ఇలా చాలా డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. అన్నపూర్ణలో ఒక భారీ టెంపుల్ సెట్ ని క్రియేట్ చేశాం. కథకు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా తీశాం. మేము అనుకున్న క్వాలిటీ ఇవ్వగలిగా, ఆ కారణంగా బడ్జెట్ పెరిగింది. భీమా బిజినెస్ పరంగా హ్యాపీగా ఉన్నాం. అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యుటర్స్ సినిమాపై చాలా ఆసక్తి చూపించారు. పెద్ద సంఖ్యలో రిలీజ్ చేస్తున్నారు. గోపీచంద్ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్. ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ కూడా క్లోజ్ చేశాం.
భీమా లో వీఎఫ్ఎక్స్ వర్క్
భీమాలో వీఎఫ్ఎక్స్ కి చాలా ప్రాధాన్యత వుంది, ఎక్కడా రాజీ పడకుండా చేశాం. కావాల్సిన సమయం కూడా తీసుకున్నాం, అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది. అందరూ థియేటర్ లో ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది.
రవి బస్రూర్ మ్యూజిక్
రవి బస్రూర్ కేజీఎఫ్ సలార్ చేశారు, హర్ష కి రవి బస్రూర్ కి ముందే పరిచయం ఉంది. ఈ సినిమాకి రవి బస్రూర్ అయితే బాగుంటుందని అనుకున్నాం, మేము ఊహించిన దానికంటే అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమా చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. నేను ఇప్పటికే మూడు సార్లు చూశా, చూసిన ప్రతిసారి గూస్ బంప్స్ వచ్చాయి.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!