పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూ ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న రిలీజ్ డేట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ పై అభిమానులకు కొన్ని అనుమానాలు రేకెత్తుతున్న వేళ.. ఎలాంటి అనుమానాలు లేవని.. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న థియేటర్లోకి వస్తున్నట్లు మరోసారి తెలిపారు మేకర్స్. కొత్త పోస్టర్ తో పవర్ స్ట్రోమ్ కి రెడీ గా ఉండండి అంటూ మేకర్స్ ప్రకటించారు.
ఇక నేటితో ఈ సినిమా షూటింగ్ ని కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. ఒకదాని తరువాత ఒకటి అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో జోష్ పెంచేస్తున్నారు. ఇక ఈ కొత్త పోస్టర్ తో ఫిబ్రవరి 25 కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అది కాకుండా ఏపీ ప్రభుత్వం కూడా 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఇవ్వడంతో పవన్ అభిమానులు మరింత రచ్చ చేస్తున్నారు. ఇక మరికొద్దిరోజుల్లో టికెట్ రేట్లపై జీవో కూడా రిలీజ్ చేస్తే ఇంకా హ్యాపీ అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి అది జరుగుతుందా..? లేదా..? అనేది తెలియాలి.
