Bheemla Nayak: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ రోజే ఓటిటీలోకి భీమ్లా నాయక్..

pawan kalyan

pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తీపికబురు అందించారు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటీలోకి వచ్చే డేట్ ని ప్రకటించేశారు. ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ రోజునే భీమ్లా నాయక్ ఓటిటీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 25 నుంచి “భీమ్లా నాయక్” స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటించారు. వస్తున్నాడు.. భీమ్లా నాయక్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో.. భీమ్లా సందడి మొదలు అయిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీంతో పాటు అః లో కూడా అదేరోజు భీమ్లా సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని ఆహా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ వార్తతో అభిమానులకు పండగ మొదలైంది. ఎప్పుడెప్పుడు మార్చి 25 వస్తుందా అని ఎదురుచూస్తున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. పవర్ స్టార్ పవర్ స్ట్రోమ్ చూడాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.