NTV Telugu Site icon

Kamal haasan : భారతీయుడు వచ్చాడు…కానీ ప్రేక్షకులే రావట్లేదు..ఎందుకని..?

Untitled Design (3)

Untitled Design (3)

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం భారతీయుడు -2. వీరి కాంబోలో గతంలో వచ్చిన భారతీయుడు ఘన విజయం సాధించిన విషయం విదితమే. దాదాపు 28 సంవత్సరాల తర్వాత దానికి కొనసాగింపుగా భారతీయుడు -2ను తీసుకువచ్చారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ దిశగా సాగుతోంది.

ఈ నెల 12న విడుదలైన ఇండియన్ -2 తొలి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 161కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 28.88 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. కానీ డివైడ్ టాక్ తో రెండవ రోజు కలెక్టన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. తమిళనాడులో మాత్రమే ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టింది. వీకెండ్ ముగిసి వర్కింగ్ డేస్ స్టార్ట్ అవడంతో భారతీయుడు -2 చూసేందుకు ప్రేక్షకులు కరువయ్యారు.

ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రలలో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 25కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. మొదటి రోజు రెండు స్టేట్స్ లో 7.08కోట్ల షేర్ రాబట్టి ఆశ్యర్యపరిచింది. కానీ రెండవ రోజు నుండి బాక్సాఫీస్ రేసులో భారతీయుడు-2 చతికిల పడ్డాడు. మొదటి వీకెండ్ ముగిసే నాటికి తెలుగు రాష్ట్రాలలో 12కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ కావడం అనేది అసాధ్యం అనే చెప్పాలి. దీంతో ఆంధ్ర, నైజాం (సీడెడ్ కాకుండా) సగానికి సగం కూడా వచ్చేలా లేదు రైట్స్ కొనుగోలు చేసిన పంపిణీదారులకు. తెలుగులో భారతీయుడు భారీ డిజాస్టర్ కిందే లెక్క.

 

Also Read: Raj tarun : మాల్వీ మల్హోత్రా నిజస్వరూపం బయటపెట్టే మరోక వీడియో…ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..?