NTV Telugu Site icon

Bharateeyudu 2: భారతీయుడుకు చావే లేదు.. సేనాపతి తిరిగి వచ్చాడు

Kamal

Kamal

Bharateeyudu 2: విశ్వ నటుడు కమల్ హాసన్ – శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాను మర్చిపోవడం ఏ సినీ ప్రేక్షకుడు వలన కాదు. లంచం ఇచ్చినా.. తీసుకున్నా అప్పట్లో సేనాపతి వస్తాడు అని ఎంతోమంది నమ్మారు. 1996 లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక దాదాపు 27 ఏళ్ల తరువాత సేనాపతి తిరిగి వచ్చాడు. కమల్ హాసన్ – శంకర్ కాంబో మరోసారి ఈ సీక్వెల్ తో రిపీట్ అయ్యింది. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. లైకా ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, సిద్దార్థ్ తో పాటు చాలామంది స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. లంచం తీసుకున్నాడని సొంత కొడుకునే చంపిన సేనాపతి.. ఎవరికి కనిపించకుండా వెళ్లిపోవడం.. ఆయన కోసం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడంతో భారతీయుడు ముగిసింది.

Pawan Kalyan: నెత్తురు మరిగిన హంగ్రీ చీతా.. బ్లాక్ అండ్ బ్లాక్ లో ఏమున్నాడు

ఇక భారతీయుడు 2.. ఎక్కడ ఆపారో అక్కడ నుంచే మొదలైనట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఇంట్రో దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ చేసి.. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ఇక ఈ ఇంట్రోలో ” ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను.. భారతీయుడుకు చావే లేదు” అని సేనాపతి చెప్పిన డైలాగ్ తో మొదలైంది. ఇక ఇందులో కూడా పేదవారు దగ్గరనుంచి గవర్నమెంట్ ఆఫీసర్లు లంచం తీసుకోవడం.. డబ్బు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవడం చూపించారు. కరెప్ట్ అయిన తన దేశాన్ని కాపాడుకోవడానికి మరోసారి భారతీయుడు వచ్చినట్లు చూపించారు. ఇక ఇందులో సిద్దార్థ్ సేనాపతికి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపించాడు. భారతీయుడు తిరిగి రావాలని కొన్ని కోట్లమంది జనాలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసినాట్లు చూపించారు. ఇక చివర్లలో భారతీయుడు తిరిగి వచ్చాడు అని సేనాపతి లుక్ ను చూపించి శంకర్ ఒక్కసారిగా హైప్ పెంచేశాడు. ఇక అనిరుధ్ మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఇంట్రో వీడియో నెట్టింట వైరల్ గా మారింది.