NTV Telugu Site icon

Bhanu Sree: బన్నీ బ్లాక్ చేశాడు అనే ట్వీట్, ఛానెల్ ప్రమోషన్ కోసమేనా?

Allu Arjun

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనని ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు అంటూ ఒక హీరోయిన్ సెన్సేషనల్ ట్వీట్ చేసింది. ఇంతకీ అసలు ఆ హీరోయిన్ ఎవరా అని చూస్తే గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘వరుడు’ అనే సినిమా చేశాడు. తమిళ నటుడు ఆర్య విలన్ గా నటించిన ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది ‘భానుశ్రీ మెహ్రా’. వరుడు సినిమాలో భానుశ్రీ నటిస్తుంది అనే విషయాన్ని రివీల్ చెయ్యడానికి, హీరోయిన్ ఫేస్ ఆడియన్స్ కి చూపించడానికి గుణశేఖర్ చేసిన హడావుడి అయితే అంతా ఇంతా కాదు. తెలుగులో ఒక కొత్త హీరోయిన్ ఇన్ ఇంట్రడ్యూస్ చెయ్యడానికి ఈ రేంజ్ హంగామా ఇప్పటివరకూ ఎవరు చేసి ఉండరు. లిటరల్ గా తెలుగులో భానుశ్రీకి డ్రీమ్ డెబ్యు దొరికింది. మొదటి సినిమానే అల్లు అర్జున్ లాంటి హీరోతో నటిస్తుంది అంటే భానుశ్రీ త్వరలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోతుందని అంతా అనుకున్నారు కానీ వరుడు సినిమా ఫ్లాప్ అయ్యింది. భారి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించని రేంజులో డిజాస్టర్ అవ్వడంతో భానుశ్రీ కెరీర్ హోప్స్ తలకిందులు అయ్యాయి. ఆ తర్వాత పెద్దగా సినిమాలు రాకపోవడంతో భానుశ్రీని ఆడియన్స్ మర్చిపోయారు. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉండే భానుశ్రీ, అల్లు అర్జున్ తనని ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు అంటూ స్క్రీన్ షాట్ కూడా పెట్టేసింది.

Read Also: NTR: ధమ్కీ ఈవెంట్ లో ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చిన ఫ్యాన్…

ఈ ట్వీట్ పెట్టిన కాసేపటికే అల్లు అర్జున్ తనని అన్ బ్లాక్ చేశాడు అంటూ భానుశ్రీ స్క్రీన్ షాట్ తో పాటు ఇంకో ట్వీట్ పోస్ట్ చేసింది. “నేను నా కెరీర్ కష్టాలకి అల్లు అర్జున్ ని ఎప్పుడూ నిందించలేదు” అంటూ భానుశ్రీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు భానుశ్రీని అల్లు అర్జున్ ఎందుకు బ్లాక్ చేశాడు? ఎందుకు అన్ బ్లాక్ చేశాడు అనే డిస్కషన్ మొదలయ్యింది. అయితే సినిమాల్లో పూర్తిగా అవకాశాలు కోల్పోయిన భానుశ్రీ ఇటివలే ఒక యుట్యూబ్ ఛానెల్ పెట్టింది. తన పేరు పైనే ‘భానుశ్రీ మెహ్రా’ అనే పేరుతో యుట్యూబ్ ఛానెల్ పెట్టింది భానుశ్రీ. ట్రావెల్ వ్లాగ్స్ ని, తన డైలీ రొటీన్ ని, సినిమాల్లో నేర్చుకున్న విషయాలని… లా డిఫరెంట్ టాపిక్స్ తో వీడియోలు తీసి యుట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తున్న భానుశ్రీకి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా అంతంతమాత్రంగానే ఆడియన్స్ ఉన్నారు. ఎక్కువ రీచ్ రావడం కోసం ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తుంది భానుశ్రీ. దాదాపు పది నెలలుగా ఉన్న ఛానెల్ ప్రమోషన్స్ కోసమే భానుశ్రీ ఇలా చేసి ఉండొచ్చు అని కొందరు ఫీల్ అవుతున్నారు. ఇందులో ఎంత నిజముంది అనేది భానుశ్రీకి మాత్రమే తెలియాలి. ఏది ఏమైనా సినిమాల్లేక డిప్రెషన్ లోకి వెళ్లకుండా యుట్యూబ్ ఛానెల్ పెట్టుకున్న భానుశ్రీ ఆడియన్స్ ని వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తుందేమో చూడాలి.

 

Show comments