Site icon NTV Telugu

Bhanu Chander: రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ssr

Ssr

‘నిరీక్షణ’  చిత్రంతో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సీనియర్ హీరోయిన్ భానుచందర్. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ మాస్టర్‌ వేణు కుమారుడిగా పరిశ్రమలోకి వచ్చిన ఆయన  నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా  మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలక పత్రాలు పోషిస్తున్న ఈ నటుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో దర్శకధీరుడు రాజమౌళిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం.. అవికాస్తా వైరల్ గా మారడం జరిగిపోయాయి.

“రాజమౌళి దేశం మొత్తం గర్వించదగ్గ  దర్శకుడు అవుతాడని నేను 12 ఏళ్ళ క్రితమే చెప్పాను. నేను రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి సినిమా చేశాను. ఆ సినిమా చేశాకా రాజమౌళి తో ఒక మాట చెప్పాను.  నా డబ్బింగ్  జరిగేటప్పుడు ఆయనను పిలిచి ఒక మాట చెప్పాను.  ఈ సినిమా తర్వాత నేను మీకు ఫోన్‌ చేస్తాను. కానీ మీరు  ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. సినిమా పెద్ద హిట్ అవుతుంది. మీరు దేశం మొత్తం గర్వించదగ్గ దర్శకులు అవుతారు. నిజం చెప్పాలంటే ఒక డైరెక్టర్ కు సినిమా ఎలా తీయాలి అనేదానితో పాటు ఆ సినిమాను ప్రజల్లో ఎలా ప్రమోట్ చేయాలి అనేది తెలియాలి. అది రాజమౌళికి బాగా తెలుసు. రాజమౌళి చాక్లెట్‌ పేపర్‌లో మట్టి పెట్టి వండర్ ఫుల్ చాక్లెట్‌ అని చెప్పి అమ్మగలడు.. అంతటి సత్తా ఉంది అతనిలో.. రాజమౌళి ప్రమోషన్స్ చూసి మిగతావాళ్లు నేర్చుకోవాలి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version