NTV Telugu Site icon

Bhandavi Sridhar: అర్థంపర్థం లేకుండా ఇంత అందంగా ఉన్నావ్ ఏంటి పిల్లా?

Bhandavi Sridhar

Bhandavi Sridhar

మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో అందంగా కనిపిస్తూనే, ఆడియన్స్ ని భయపెట్టింది భాంధవి శ్రీధర్. తన డెబ్యు మూవీతోనే ప్రేక్షకులని మెప్పించిన భాంధవి శ్రీధర్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు నుంచే తన ఫొటోలతో ఆకట్టుకునే భాంధవి శ్రీధర్, ఫోటోషూట్ ల పేరుతో ఎప్పుడూ మితిమీరిన స్కిన్ షో చెయ్యలేదు. ట్రెండ్ అండ్ ట్రెడిషనల్ కలగలిపినట్లు ఉండే ఈ యంగ్ బ్యూటీ లేటెస్ట్ గా ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు సూపర్బ్ గా ఉన్నాయి. బ్లాక్ సారీలో బ్యాక్ టు బ్యాక్ ఫోటోలని పోస్ట్ చేస్తున్న భాంధవి శ్రీధర్ నడుము అందాలని చూపించి చూపించనట్లు, కనిపించి కనిపించట్లు చూపిస్తూ యూత్ ని అట్రాక్ట్ చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన ఫాన్స్, నానిలా మారిపోయి… “నీకేమైనా పిచ్చా అర్ధపర్ధం లేకుండా ఇంత అందంగా ఉన్నావ్ ఏంటి? అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, అది క్రైమ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: PS-2: మూడు రోజుల్లో చోళులు వస్తున్నారు…

గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ రెండూ ఉన్నాయి కాబట్టి భాంధవి శ్రీధర్ కి తెలుగులో మంచి ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉంది. హీరోయిన్ గా డెబ్యు ఇవ్వడం కన్నా ముందు భాంధవి శ్రీధర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. మిస్టర్ పర్ఫెక్ట్, రభస, మొగుడు, రామయ్య వస్తావయ్య, మజ్ను సినిమాల్లో నటించిన భాంధవి శ్రీధర్ కి మసూద సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక్కడి నుంచి కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే తెలుగు నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి హీరోయిన్ దొరికేసినట్లే. మరి స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో. గ్లామర్ షో విషయంలో భవిషత్తులో భాంధవి శ్రీధర్ ఎలాంటివి సెలక్ట్ చేసుకుంటుందో చూడాలి.

Show comments