NTV Telugu Site icon

Kalki 2898 AD: కల్కిలో ప్రభాస్ లుక్.. అదిరిపోయింది బాసూ!

Prabhas Look

Prabhas Look

Bhairava Look of Prabhas in Kalki 2898 AD Revealed: కల్కి సినిమా కోసం కేవలం ప్రభాస్ అభిమానులే కాదు సినీ అభిమానులు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు చేసింది కొన్ని సినిమాలు అయినా తనకంటూ ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్ సృష్టించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ కల్కి 2898 ఏడి సినిమా తెరకెక్కుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దిశా పటానీ, దీపికా పదుకొనె హీరోయిన్లుగా నటిస్తున్నారు. , ఇక ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌ కీ రోల్ ప్లే చేస్తుండగా లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఇదిలా ఉండగా ‘కల్కి 2898 AD’లో ప్రభాస్ కొత్త లుక్ రిలీజ్ చేశారు. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. అందులో ప్రభాస్ లుక్ ను డిఫరెంట్ స్టైల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో విడుదల చేశారు.

Crew: ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ బాలీవుడ్ కామెడీ డ్రామా..

IPLలో మే 3న ముంబై, KKR మ్యాచ్ ఉంటుందని ప్రభాస్ తో చెప్పించారు. ఇక ఆ తరువాత భైరవ ఆశ్చర్యపరిచాడా? అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. ప్రభాస్ లుక్ అయితే ఒక రేంజ్ లో కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా IPL 2024 మ్యాచ్ మధ్యలో ప్రభాస్ ‘భైరవ’ అవతార్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ వీడియో లక్నో సూపర్ జెయింట్స్ VS ముంబై ఇండియన్స్ IPL మైక్ సందర్భంగా ప్రదర్శించబడింది. తన భైరవ గెటప్ లో ప్రభాస్ కనిపించాడ. మునుపటి IPL ప్రసారాల సమయంలో అమితాబ్ బచ్చన్ యొక్క అశ్వత్థామ పాత్రను రివీల్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ భైరవ అవతార్ ను రివీల్ చేశారు. ఇక ‘కల్కి 2898 AD’ 27 జూన్ 2024న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show comments