Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagyashri Borse ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరోయిన్ కావాలనే తన నిర్ణయం వెనుక ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “నేను హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు నా కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. మొదట నా తల్లితో మాట్లాడాను. కానీ ఆమె నా నిర్ణయానికి అంగీకరించలేదు. ఆ తర్వాత నాన్నను అడిగితే.. ‘మీ అమ్మకు ఇష్టం లేదు’ అని చెప్పారు. కనీసం నా సోదరి అయినా నాకు అండగా ఉంటుందని అనుకున్నాను. కానీ ఆమె కూడా నా నిర్ణయాన్ని వ్యతిరేకించింది. కుటుంబంలో అందరూ నా ఆలోచనకు వ్యతిరేకంగానే ఉన్నారు” అని తెలిపారు. అయితే నటిగా మారాలనే తన కలను మాత్రం వదులుకోలేదని భాగ్యశ్రీ చెప్పారు.
“ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా లక్ష్యాన్ని వదల్లేదు. ఒక దశలో నా తల్లి నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేశారు. దాదాపు ఆరు నెలల పాటు నాతో మాట్లాడలేదు” అని భావోద్వేగానికి గురయ్యారు. అయినప్పటికీ తనపై తనకు నమ్మకం ఉండేదని, ఒకరోజు తన తల్లి తన గురించి గర్వపడే స్థాయికి చేరుకుంటాననే విశ్వాసమే తనను ముందుకు నడిపించిందని భాగ్యశ్రీ తెలిపారు. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారుతున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
- Brahma Muhurat: "బ్రహ్మ ముహూర్తం"లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
- Ajay Bhupathi: మహేష్ బాబు ఫ్యామిలీ హీరోతో సినిమా.. ఎందుకో చెప్పిన డైరెక్టర్ అజయ్ భూపతి!
- Bhogi: 800 మంది జూనియర్ ఆర్టిస్టులు, 22 రోజుల భీభత్సం.. శర్వానంద్ 'భోగి' క్లైమాక్స్ పూర్తి!
తాజావార్తలు
-
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
-
Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
-
Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
-
Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ క్లారిటీ
-
Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. పిటిషన్ ఉపసంహరణపై హైకోర్టు సీరియస్..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!