నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘భగవంత్ కేసరి’. శ్రీలీల కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా 2023 విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల కు పైగా గ్రాస్ కలెక్షన్ల రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు.
Also Read : Mega157 : చిరు – అనిల్ మరో షెడ్యూల్ స్టార్ట్
తాజాగా విజయ్ బర్త్ డే కనుకగా ఈ సినిమా ఫస్ట్ రోర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. పోలీస్ గెటప్ లో విజయ్ లుక్ ను పరిచయం చేస్తూ చేసిన వీడియోకు అనిరుధ్ పవర్ఫుల్ బీజీమ్ అందించాడు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. విజయ్ సినిమా గ్లిమ్స్ కంటే బాలయ్య సినిమా గ్లిమ్స్ బాగుందని, బాలయ్య ఆరా ను విజయ్ మ్యాచ్ చేయలేదని యాంటీ విజయ్ ఫ్యాన్స్ రెండిటిని కంపేర్ చేస్తూ విడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే అనిరుధ్ మ్యూజిక్ పవర్ఫుల్ గా లేదని భగవంత్ కేసరికి టాలీవుడ్ సెన్సేషన్ థమన్ కొట్టిన మ్యూజిక్ వేరే లెవల్ అని విజయ్ గ్లిమ్స్ కు తమన్ మ్యూజిక్ ను యాడ్ చేసి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అందుకు కౌంటర్ గా జననాయకుడు రోర్ బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిందని విజయ్ ఫ్యాన్స్ వీడియోలు చేస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న జానాయకుడు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకాగా జనవరి 9న రిలీజ్ కానుంది.
#JanaNayagan x #BhagavanthKesari 👀? Yemi raahh? pic.twitter.com/urZScq6gEl
— SRS CA TV (@srs_ca_tv) June 21, 2025
