NTV Telugu Site icon

Bhagavanth Kesari: బుల్లెట్ బైక్ పై ఛేజింగ్ సీన్.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందేనట!

Bhagawanth Kesari Leaked

Bhagawanth Kesari Leaked

Bhagavath Kesari Leaked Chasing Scene: నటసింహ నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ మధ్యనే బాలకృష్ణ పుట్టినరోజు సంద్భర్భంగా ఒక చిన్న టైటిల్ రివీల్ టీజర్ కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ తో అభిమానులలో ఫుల్ జోష్ ని నింపేశాడు బాలయ్య. బాలయ్య 108వ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీ లీల బాలయ్య బాబుకు కూతురుగా కనిపించనుంది. బాలయ్య, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని మేకర్స్ ఎప్పటినుంచో ఊదరకొడుతున్నారు.
Boss Party: మనవరాలి ఆగమనం..సన్నిహితులకు ‘మెగా పార్టీ’!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ లుక్, ఫస్ట్ లుక్‌, టీజర్‌తో కి హ్యూజ్ రెస్పాన్స్ రాగా దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేవిధంగా ప్రమోషన్స్ కూడా సరికొత్తగా చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన లీక్ వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ బుల్లెట్ బైక్ మీద ఛేజ్ చేసే యాక్షన్ సీన్ అయితే అల్టిమేట్ గా ఉందని చెబుతున్నారు. విలన్ అండ్ కోని వెంటాడుతూ బాలకృష్ణ చేసే ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. ఈ విషయాన్ని బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ పేరుతొ ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ లీకైన ఫోటోను చూసేయండి మరి.

Show comments