NTV Telugu Site icon

Bhagavanth Kesari: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలపై సాంగ్ షూట్.. రచ్చ రచ్చే అంటున్నారే!

Bhagavanth Kesari Song Shooting

Bhagavanth Kesari Song Shooting

Bhagavanth Kesari Song Shooting at ramoji film city:నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలపై రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్‌లో ‘భగవంత్’ కేసరి సాంగ్ షూట్ జరుగుతోందని తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్’ భగవంత్ కేసరి’ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది విడుదలయ్యే భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో ఒకటైన ఈ భగవంత్ కేసరి కూడా ఒకటి. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ షూటింగ్ హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సిలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల సహా ప్రధాన తారాగణంపై ఓ పాటను షూట్ చేస్తున్నారు.

Kota Bommali: తెలుగులో ‘కోటబొమ్మాళి పీఎస్’గా మలయాళ బ్లాక్ బస్టర్

భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ లో ప్రధాన తారాగణం అంతా కనిపిస్తారని, ఈ పాటను బిగ్ స్క్రీన్స్ పై చూడటం కన్నుల పండువగా ఉంటుందని అంటున్నారు.’భగవంత్ కేసరి’ యునిక్ కాన్సెప్ట్‌ తో హై యాక్షన్‌ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అనిల్ రావిపూడి ప్రజంట్ చేస్తున్నారని అంటున్నారు. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజన్స్, తెలంగాణ యాసలో డైలాగ్‌లని చెప్పడం అందరికీ నచ్చుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల ఒక కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌కి విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాకి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇక భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుండగా నందమూరి అభిమానులు మాత్రమేకాదు సినీ ప్రేక్షలులందరూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.