NTV Telugu Site icon

Bhagavanth Kesari: బాలయ్య సినిమాకు సడీచప్పుడు లేదేంటీ.. ?

Bala

Bala

Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించింది. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. దాదాపు వంద కోట్ల వరకు కలక్షన్స్ రాబట్టి బాలయ్య సత్తా ఏంటో మరోసారి రుజువుచేసింది. మొదటిసారి అనిల్ రావిపూడి, బాలకృష్ణ తమ పంథాను మార్చుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఆడపిల్లలను ఎలా చూడాలి.. ఎలా పెంచాలి అనేది అనిల్ రావిపూడి బాగా చూపించాడు. ముఖ్యంగా గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి బాలయ్య నోట చెప్పించి.. జనాలు ఆలోచించేలా చేసాడు అనిల్ రావిపూడి.

Kamal And Rajini: విక్రమ్ మీట్స్ జైలర్.. పర్ఫెక్ట్ పిక్చర్

ఇక ఈ సినిమా థియేటర్ లోకి వచ్చి నెల దాటింది. దీంతో ఈ సినిమా ఓటిటీలోకి రావడానికి సిద్ధమైంది. భగవంత్ కేసరి ఓటిటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ అందుకున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటీ డేట్ ను మేకర్స్ అధికారికంగా తెలిపారు. నవంబర్ 24 అనగా రేపటినుంచే భగవంత్ కేసరి.. అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఓటిటీకి ప్రమోషన్స్ చేసింది లేదు. స్ట్రీమింగ్ కు ఒక్కరోజు ముందు మాత్రమే చెప్పడం ఆశ్చర్యంగా ఉందని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా బాలయ్య సినిమా ఇలా సైలెంట్ గా ఓటిటీలోకి రావడం అస్సలు బాలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఓటిటీలోకి వచ్చాకా అయినా చప్పుడు చేస్తుందో లేదో చూడాలి.

Show comments