Site icon NTV Telugu

Bhagavanth Kesari: 48 గంటల్లో బాలయ్య హ్యాట్రిక్ కి పునాది

Bhagavanth Kersari

Bhagavanth Kersari

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్లు రాబట్టిన నందమూరి నట సింహం బాలయ్య, ఈసారి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘భగవంత్‌ కేసరి’ సినిమాతో అక్టోబర్ 19న థియేటర్స్ లోకి వచ్చి మూడోసారి వంద కోట్లు కలెక్ట్ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్‌ ఎలిమెంట్లు, అనిల్‌ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్‌ మిస్ అవ్వకుండా ఉంటుందని చెప్పేశారు మేకర్స్. బాలయ్య సెంచరీ కొట్టడంపై ఎవరికీ ఎలాంటి డౌట్స్ లేవు. ట్రైలర్ బయటకి వచ్చిన తర్వాత భగవంత్ కేసరి కొట్టే సెంచరీపై మరింత నమ్మకం పెరిగింది అందరికీ.

వీర సింహా రెడ్డి సినిమా 73 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. భగవంత్ కేసరి ఏకంగా 75 కోట్ల ప్రీరిలీజ్ థియేటర్ బిజినెస్ చేసింది. బాలయ్య కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ ఫిగర్. ఇంత రాబట్టాల్సి ఉన్నా కూడా ఎవరిలో ఎలాంటి భయాలు లేవు ఎందుకంటే బాలయ్య క్రేజ్ ఈ మధ్య కాలంలో ఆ రేంజులో పెరిగింది. జై బాలయ్య అనేది ఒక సెలబ్రేషన్ స్లోగన్ లా అయిపొయింది అంటే యూత్ బాలయ్యకి ఎంత కనెక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఇంపాక్ట్ బాలయ్య కలెక్షన్స్ పై చూపించడం గ్యారెంటీ. బాలయ్య క్రేజ్ కి తోడు థియేటర్స్ కూడా ఎక్కువగానే దొరికాయి కాబట్టి భగవంత్ కేసరి కలెక్షన్స్ పీక్స్ లో ఉంటాయి. సో మరో 48 గంటల్లో అన్ని సెంటర్స్ లో భగవంత్ కేసరి మేనియా స్టార్ట్ అయిపోతుంది, మొదటి షో పడగానే హ్యాట్రిక్ వంద కోట్ల ప్రయాణం కూడా మొదలవుతుంది.

Exit mobile version