Site icon NTV Telugu

సెన్సార్ కి రెడీ అవుతున్న ‘భగత్ సింగ్ నగర్’

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక జంటగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ బాషలలో రూపొందిన ఈ సినిమా టీజర్ ప్రకాష్ రాజ్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి లిరికల్ సాంగ్ ‘చరిత చూపని’ మిలియన్ వ్యూస్ సాధించటం పట్ల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు దర్శకనిర్మాతలు. త్వరలో మిగిలిన పాటలను విడుదల చేసి సినిమాను కూడా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామంటున్నారు.

ఇండియాలో సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న బ్రిటీష్ వారి కలను చెదరగొట్టి చిరు ప్రాయం లోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి భగతసింగ్. అలాంటి ధీరుడి భావజాలాన్ని కమర్షియల్ హంగులతో సినిమాగా తీసినందుకు తమ కెంతో గర్వంగా ఉందని, త్వరలో సెన్సార్ జరిపి ఈ నెలలోనే విడుదల చేస్తామంటున్నారుదర్శకనిర్మాతలు

Exit mobile version