Site icon NTV Telugu

BhaBhaBa : అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేసిన బిగ్గేస్ట్ మల్టీస్టారర్

Mollywood (1)

Mollywood (1)

మలయాళంలో మరొక మల్టీస్టారర్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎంపురాన్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన మాలీవుడ్ లో మరోక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఈ రోజు రిలీజ్ అయింది. మాలీవుడ్ వన్స్ అపాన్ ఎ టైం స్టార్ హీరో దిలీప్ హీరోగా ‘భా భా బా’ అనే ఫిల్మ్ తెరకెక్కింది. ఈ సినిమాలో క్యామియో అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు కంప్లీట్ స్టార్ మోహన్ లాల్. నటి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న దిలీప్‌ను నిర్ధోషిగా ప్రకటించిన తర్వాత దిలీప్ నుండి వస్తున్న ఫిల్మ్ కావడంతో అంచనాలు పెరిగాయి. దీనికి తోడు లాలెట్టన్ స్పెషల్ అప్పీరియన్స్ మూవీకి మరింత ఎట్రాక్షన్ అయింది.
చిరకాల మిత్రులు ఇద్దరు కలిసి రాబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్టే అడ్వాన్సు బుకింగ్స్ అదరగోట్టాయి. మలయాళ బిగ్గెస్ట్ అడ్వాన్స్ సేల్స్ లో రూ. 11.69 కోట్లతో ఎంపురాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక సెకండ్ ప్లేస్ లో సూపర్ స్టార్ రజినికాంత్ కూలీ రూ. 8.02 కోట్లతో రికార్డు నెలకొల్పింది. మూడవ ప్లేస్ లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆయిన ‘భా భా భా’ నిలిచింది. కేవలం కేరళలో మాత్రమే రూ. 4.29 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తో రాబట్టింది. ఇందుకు కారణం దిలీప్, మోహన్ లాల్. చాలా కాలం తర్వాత చిరకాల మిత్రులు ఇద్దరు కలిసి నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ క్రేజ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపించింది. నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న భా భా భా రాబోఏ రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version