Site icon NTV Telugu

Bhaag Saale: టిల్లు అన్న కథ చెప్తే అట్లుంటది మరి…

Bhaag Saale

Bhaag Saale

మన డీజే టిల్లు సిద్ధూ జొన్నలగడ్డ కథ చెప్తే ఎవరైనా ఊ కొట్టాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో సిద్ధూ జొన్నలగడ్డ చెప్పిన ఒక కథ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే ‘సింహా కోడూరి’ హీరోగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భాగ్ సాలే’. ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం, నాన్న కూచీలతో లాంటి క్రియేటివ్ వర్క్స్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత్ బ్రహ్మాండపల్లి ‘భాగ్ సాలే’ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 7న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు.

Read Also: Indian 2: కమల్ కే షాక్ ఇచ్చిన ఎయిర్పోర్ట్ సిబ్బంది… షూటింగ్ నే ఆపేసారు

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సిద్ధూ జొన్నలగడ్డతో వాయిస్ ఓవర్ ఇప్పించి ‘భాగ్ సాలే’ ప్రపంచాన్ని ఆడియన్స్ ని పరిచయం చేసారు. ‘షాలి శుఖ గాజా’ ఒక డైమండ్ రింగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ల లైఫ్ టర్న్ అవ్వడంతో పాటు ట్రబుల్స్ ని కూడా పేస్ చేస్తూ ఉంటారు. బ్రిటిషర్లు, ఫ్రెంచ్ వాళ్లు, నైజాం రాజులని దాటుకుంటూ వచ్చిన ఆ డైమండ్ రింగ్ హీరో లైఫ్ ని ఎలాంటి మలుపులు తిప్పింది అనేది ‘భాగ్ సాలే’ కథలా కనిపిస్తోంది. టీజర్ తో మేకర్స్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయడంలో సక్సస్ అయ్యారు. మరి ఈ క్రైమ్ కామెడీ సినిమాతో సింహా కోడూరి హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version