కన్నడ డ్రగ్స్ కేస్ లో హీరోయిన్ లకు ఉచ్చు బిగుస్తుంది. రాగిణి, సంజనలు డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. 2020 అక్టోబర్ లో ఇద్దరి వెంట్రుక నమూనాలను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు బెంగుళూరు పోలీసులు. వాటిని పరీక్షించిన తర్వాత ఇద్దరు డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో పేర్కొంది. మొదట బ్లడ్, యూరిన్ నమూనాలను యాక్టర్ నుండి సేకరించి పోలీసులు ల్యాబ్ కు పంపగా… వాటిలో ఫలితం సరిగ్గా తేలకపొడంతో వెంట్రుకల నమూనాలను సేకరించారు. హైదరాబాద్ లోని ఎఫ్ఎస్ఎల్ కు యాక్టర్ల నమూనాలు వచ్చాయి. వాటిలో డ్రగ్స్ సేవించినట్టు రిపోర్ట్ రావడంతో చిక్కుల్లో పడ్డారు ఇద్దరు హీరోయిన్ లు. దాంతో మరోసారి ఇద్దరికీ సమన్లు జారీ చేయనున్నారు బెంగుళూరు పోలీసులు.
కన్నడ డ్రగ్స్ కేస్ లో హీరోయిన్ లకు బిగుస్తున్న ఉచ్చు…
![](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2021/08/ragini-1024x768.jpg)