Site icon NTV Telugu

Sreela Majumdar: క్యాన్సర్ తో స్టార్ హీరోయిన్ మృతి.. సీఎం దిగ్భ్రాంతి..

Seela

Seela

Sreela Majumdar: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటి శ్రీల మజుందార్ (65) మరణించింది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె కోల్‌కత్తాలోని తన నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచింది. దీంతో బెంగాలీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. 1980లో ఆమె హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టింది. 16 ఏళ్లకే నటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఏక్దిన్ ప్రతిదిన్, ఖరీజ్, అకలేర్ సంధానే వంటి సినిమాలు శ్రీలకి విశేష గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఏక్దిన్ ప్రతిదిన్‌ మువీకి సీక్వెల్‌గా వచ్చిన కౌశిక్ గంగూలీ ఆమె చివరి సినిమా. క్యాన్సర్ అని తెలిసాకా సినిమాలకు దూరమయ్యింది. నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే కొన్నాళ్లు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఇంటికి తీసుకొచ్చేశారు. కానీ అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. శ్రీలా తన కెరీర్‌లో మొత్తం 43 సినిమాల్లో నటించింది. ఇక ఆమెకు భర్త , ఒక కొడుకు ఉన్నారు. ఆమె మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ఇక శ్రీలా మృతిపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ” ఈరోజు మధ్యాహ్నం సినీ నటి శ్రీలా మజుందార్‌ మృతి చెందారనే వార్త చాలా బాధాకరం. శ్రీల అనేక ముఖ్యమైన భారతీయ చిత్రాలలో అత్యుత్తమ పాత్రలు పోషించిన శక్తివంతమైన నటి. ఇది బెంగాల్ చిత్ర పరిశ్రమకు పెద్ద నష్టం మరియు మేము ఆమె అద్భుతమైన నటనను కోల్పోతున్నాం. ఆమె కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను” అని తెలిపారు.

Exit mobile version