Sreela Majumdar: క్యాన్సర్ తో స్టార్ హీరోయిన్ మృతి.. సీఎం దిగ్భ్రాంతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreela Majumdar: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటి శ్రీల మజుందార్ (65) మరణించింది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె కోల్‌కత్తాలోని తన నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచింది. దీంతో బెంగాలీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. 1980లో ఆమె హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టింది. 16 ఏళ్లకే నటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఏక్దిన్ ప్రతిదిన్, ఖరీజ్, అకలేర్ సంధానే వంటి సినిమాలు శ్రీలకి విశేష గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఏక్దిన్ ప్రతిదిన్ మువీకి సీక్వెల్‌గా వచ్చిన కౌశిక్ గంగూలీ ఆమె చివరి సినిమా. క్యాన్సర్ అని తెలిసాకా సినిమాలకు దూరమయ్యింది. నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే కొన్నాళ్లు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఇంటికి తీసుకొచ్చేశారు. కానీ అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. శ్రీలా తన కెరీర్‌లో మొత్తం 43 సినిమాల్లో నటించింది. ఇక ఆమెకు భర్త , ఒక కొడుకు ఉన్నారు. ఆమె మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ఇక శ్రీలా మృతిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ” ఈరోజు మధ్యాహ్నం సినీ నటి శ్రీలా మజుందార్ మృతి చెందారనే వార్త చాలా బాధాకరం. శ్రీల అనేక ముఖ్యమైన భారతీయ చిత్రాలలో అత్యుత్తమ పాత్రలు పోషించిన శక్తివంతమైన నటి. ఇది బెంగాల్ చిత్ర పరిశ్రమకు పెద్ద నష్టం మరియు మేము ఆమె అద్భుతమైన నటనను కోల్పోతున్నాం. ఆమె కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను” అని తెలిపారు.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
Saddened by the news of the demise of film actress Sreela Majumdar today afternoon. Sreela was a noted and powerful actress who played outstanding roles in several significant Indian films.
It is a big loss for Bengal film industry and we shall miss her stellar presence. My…
— Mamata Banerjee (@MamataOfficial) January 27, 2024
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!