Site icon NTV Telugu

Bidisha De Majumdar: సూసైడ్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. అదే కారణమంట..?

Bidisha

Bidisha

చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బెంగాలీ స్టార్ హీరోయిన్ బిదిషా డి మజుందార్‌(21) ఆత్మహత్యకు పాల్పడింది. కోల్ కత్తా లోని తన నివాసంలో గురువారం ఉదయం శవమై కనిపించింది. వివరాల్లోకి వెళితే.. బెంగాలీలో పలు చిత్రాలలో నటించి మెప్పిస్తున్న బిదిషా కోల్‌కతాలోని ఒక అపార్టుమెంట్ లో తల్లితండ్రులతో కలిసి నివసిస్తోంది. ఇక 2021లో అనిర్బేద్ చటోపాధ్యాయ దర్శకత్వంలో ‘భార్- ది క్లౌన్’ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఆమె గత కొన్నిరోజులుగా బయట కనిపించడం లేదు. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమె తనగదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

తన చావుకు గల కారణాలను సూసైడ్ లెటర్ లో రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇక ఉదయం తన గది తీర్చి చుసిన తల్లిదండ్రులకు ఆమె ఫ్యాన్ కు వేలాడుతూ శవంలా కనిపించింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రేమ విఫలం అవ్వడం వలనే ఆమె ఈ దారుణానికి పాల్గొని ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన కూతురుకు ఎలాంటి ప్రేమ కథ లేదని, తమకు తెలిసినంతవరకు తానెప్పుడు హ్యాపీగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version