NTV Telugu Site icon

Chatrapathi Teaser: ఏమో అనుకున్నాం కానీ.. బెల్లంబాబు బాలీవుడ్ ను ఏలేసేలానే ఉన్నాడు

Bellamkonda

Bellamkonda

Chatrapathi Teaser: అల్లుడు శ్రీను సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తనకు తగ్గ కథలను ఎంచుకొని అన్ని కాకపోయినా కొన్ని సినిమాలతో విజయాన్ని అందుకున్నాడు. ఇక బెల్లంకొండ పై ఎన్ని ట్రోల్స్ వచ్చినా విమర్శలు వచ్చినా అస్సలు పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ పోతాడు. అయితే ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఛత్రపతి. ఈ సినిమాను బెల్లంబాబు.. బాలీవుడ్ లో అదే పేరుతో రీమేక్ చేస్తున్నాడు. టాలీవుడ్ మాస్ డైరెక్టరో వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా పెన్ స్టూడియోస్ పతాకంపై ధావల్ జయంతిలాల్ గద, అక్షయ్ జయంతిలాల్ గద నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Akanksha Dubey: హోటల్ గదిలో ఉరేసుకున్న నటి.. చివరగా ఆమెతో గడిపిందెవరు..?

ఇక నేడు శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదట సాయి శ్రీనివాస్ ఏంటి.. ప్రభాస్ సినిమాను రీమేక్ చేయడమేంటి.. ప్రభాస్ లా బెల్లంబాబు కనిపిస్తాడా..? అని ఎన్నో అనుమానాలను అభిమానులు వ్యక్తపరిచారు. ఈ టీజర్ లో ఆ అనుమానాలన్నింటిని పటాపంచలు అయ్యాయి. ఛత్రపతిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగానే సెట్ అయ్యాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అద్భుతమని అంటున్నారు. ఇక తెలుగు సినిమాకు మక్కీకి మక్కీ దింపినా యాక్షన్ సీన్స్ ను మాత్రం బాలీవుడ్ ప్రేక్షకులు ఏది కోరుకుంటున్నారో అందుకు తగ్గట్టు డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. ఇక కీరవాణి అంత కాకపోయినా తనిష్క్ బాఘ్చి సంగీతం, రవి బసూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి బెల్లంబాబును ఏమో అనుకున్నా.. ఈ సినిమాతో బాలీవుడ్ ను ఏలేసేలా కనిపిస్తున్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఈ కుర్ర హీరోకు ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి.

Show comments