Site icon NTV Telugu

Chatrapathi: ట్రైలర్ లో ఆ ఒక్కటి తగ్గింది పుష్ప…

Chatrapathi

Chatrapathi

ప్రభాస్ ని పర్ఫెక్ట్ మాస్ కటౌట్ గా చూపిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఛత్రపతి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఛత్రపతి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. 2005లో వచ్చిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు వీవీ వినాయక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని తెలుగులో లాంచ్ చేసిన వినాయక్, హిందీలో కూడా లాంచ్ చేస్తూ ‘ఛత్రపతి’ అనే టైటిల్ తోనే ఈ రిమేక్ ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పార్ట్ ఎప్పటినుంచో జరుపుకుంటున్న ఈ మూవీతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నార్త్ లో సాలిడ్ డెబ్యు ఇస్తాడని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి.

మే 12న ఛత్రపతి సినిమాని రిలీజ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ఇప్పటికే స్టార్ట్ చేసిన ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ ‘ఛత్రపతి’ హిందీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సాలిడ్ ఫిజిక్ తో ఉండే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని వినాయక్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాడు. ఛత్రపతి టీజర్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో ట్రైలర్ దాన్ని డబుల్ చేసింది. తెలుగు ఛత్రపతిలో రాజమౌళి కథని శ్రీలంకకి ఇండియాకి మధ్య వస్తే హిందీలో మాత్రం మార్కెట్ ని కాష్ చేసుకోవడానికి ఇండో-పాకిస్థాన్ మధ్య వేశారు. ఈ డిఫరెన్స్ మినహా కథలో పెద్దగా మార్పులు చేసినట్లు లేరు. ట్రైలర్ అంతా బాగానే ఉంది, హిట్ కళ కనిపిస్తుంది కానీ మిస్ ఏకైక ఎలిమెంట్ కీరవాణి మ్యూజిక్. ఛత్రపతి సినిమాకి కీరవాణి గూస్ బంప్స్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఇచ్చాడు. ‘అగ్నిష్కలన’ అంటూ టైటిల్ సాంగ్ ప్లే అవుతూ ఉంటే థియేటర్స్ లో గూస్ బంప్స్ వచ్చేవి. ఆ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హిందీ ఛత్రపతిలో కనిపించలేదు. ఈ లోటు సినిమాలో కూడా కనిపించే అవకాశం ఉంది. ఇక మాస్ సినిమాలని సూపర్బ్ గా డైరెక్ట్ చెయ్యగల వినాయక్, సాలిడ్ కంటెంట్, హ్యుజ్ యాక్షన్ ఎపిసోడ్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్… ఇలా అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఛత్రపతి సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో సాలిడ్ హిట్ కొట్టడం గ్యారెంటీలానే కనిపిస్తుంది.

Exit mobile version