NTV Telugu Site icon

Kalki 2898AD: ట్రైలర్‌ వస్తోంది సరే.. వైజయంతీ వార్నింగ్ గుర్తుందా?

Kalki 2898 Ad Trailer

Kalki 2898 Ad Trailer

Before The Trailer Launch Of Kalki 2898 AD Film Makers Issued A Warning: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ‘కల్కి 2898 AD’ ట్రైలర్ లాంచ్ అయ్యే రోజు రానే వచ్చింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. అయితే లాంచ్ చేయడానికి ముందే చిత్ర నిర్మాతలు గత ఏడాది ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కల్కి 2898 AD సినిమా విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది . మీడియా నివేదికల ప్రకారం, ఎటువంటి అనధికార రికార్డింగ్ లేదా ట్రైలర్‌లోని ఎడిట్ చేసిన భాగాన్ని షేర్ చేయవద్దని మేకర్స్ సోషల్ మీడియా వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేశారు. సెప్టెంబరు 2023లో కాపీరైట్‌కు సంబంధించి మేకర్స్ హెచ్చరికలను జారీ చేసారు. ఇక దీనిని వైజయంతీ మూవీస్ మరోసారి తన X హ్యాండిల్‌లో పిన్ చేయడం చర్చనీయాంశం అయింది. వారు చేసిన ట్వీట్ ప్రకారం సినిమాలోని ఏదైనా భాగాన్ని, అది వీడియో బిట్లు అవచ్చు, ఫుటేజ్ లేదా ఫోటోలు అవచ్చు. వాటిని స్క్రీన్ షాట్ చేసి, లేదా డౌన్ లోడ్ చేసి షేర్ చేయడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు నిషేధించబడింది కూడా.

Noor Malabika: కుళ్లిపోయిన స్థితిలో ఉల్లు నటి శవం.. ఫ్లాట్లో అసలు ఏమైంది?

అలా చేసిన వారి మీద సైబర్ పోలీసుల సహాయంతో అవసరమైన విధంగా శిక్షార్హమైన, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని చెబుతున్నారు. ఇక ‘కల్కి 2898 AD’ ట్రైలర్ చూసేందుకు ప్రేక్షకుల్లో ఎంత ఉత్సాహం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్ చూస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుందో, ఇందులో ఏం క్లారిటీ వస్తుందో ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచడంలో నిర్మాతలు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రమోషన్స్ చేస్టున్నారు. కొన్నిసార్లు టీజర్, కొన్నిసార్లు పోస్టర్, కొన్నిసార్లు ఒక పాత్ర యొక్క ఫస్ట్ లుక్ షేర్ చేయడం నుండి యానిమేషన్ సిరీస్‌లను చూపించడం వరకు, సినిమాపై హైప్‌ని కొనసాగించడానికి మేకర్స్ తమ వంతు ప్రయత్నం చేశారు. ‘కల్కి 2898 AD’లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె మరియు దిశా పటాని సహా పలువురు నటీనటులు కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 27, 2024న విడుదల కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.

Show comments