తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఓటిటీ వెర్షన్ గా “బిగ్ బాస్ నాన్ స్టాప్” ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రస్తుతం Dinsey+ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. షోలో ప్రస్తుతం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. అయితే ఈ వారం ముమైత్ ఖాన్ ఎవిక్షన్ కారణంగా ఇంటి నుండి బయటకు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అనుకున్నట్టుగానే ముమైత్ ఎలిమినేట్ అయ్యింది.
Read Also : Ram Charan and Upasana vacation : రెండేళ్ల తరువాత… పిక్ వైరల్
మొదటి వారంలో ముమైత్ ఖాన్ ప్రధాన వాదన ఆర్జే చైతూతో ప్ ప్రారంభమైంది. ముమైత్ రోజూ ఉదయాన్నే సిగరెట్లు అడగడం తనకు ఇష్టం లేదని ఆర్జే చైతూ పేర్కొన్నాడు. ముమైత్ ఖాన్ దాన్ని తప్పుదారి పట్టించి ఏడ్చేసింది. వాస్తవానికి నామినేషన్లలో ఏడుగురు సభ్యులు నటరాజ్, అరియానా, సరయు, హమీద, ముమైత్ ఖాన్, మిత్ర, ఆర్జే చైతు ఉండగా, ముమైత్‌కు తక్కువ ఓట్లు రావడంతో ఆమెను ఎలిమినేట్ చేశారు. ముమైత్ తన ఎలిమినేషన్ ని అసలు ఊహించకపోవడంతో, ఎవరినీ కలవకుండానే హౌస్ బయటకు వచ్చేసింది. ఇక నాగార్జునను చూసి ఎమోషనల్ అయిపోయింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ ఒక్కొక్కరి గురించి తన ఒపీనియన్ చెప్పేసింది. అరియానా, అషురెడ్డి, అఖిల్, అజయ్, తేజస్వినిలకు వర్తీ ట్యాగ్, బిందు, ఆర్జే చైతు, సరయు, మిత్ర, శివలకు వేస్ట్ ట్యాగ్ ఇచ్చింది. బిందు, చైతు, యాంకర్ శివ కారణంగా చాలా ఇబ్బంది పడ్డాను అని ముమైత్ వెల్లడించింది.Bigg Boss Non-Stop : ఫస్ట్ ఎలిమినేషన్… అనుకున్నదే అయ్యిందిగా !