Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో

Basil Joseph

Basil Joseph

‘బాసిల్ జోసెఫ్’! నిజానికి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉంటారేమో కానీ, అతని సినిమాలు చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘మిన్నల్ మురళి’, ‘జయ జయ జయ జయ జయహే’, ‘ఫాలిమి’, ‘గురువాయూర్ అంబలనాడయిల్’, ‘పోన్ మ్యాన్’, ‘సూక్ష్మదారి’, ‘మరణమాస్’ ఇలా ఈ మలయాళం కుర్రాడు నటించిన లేదా డైరెక్ట్ చేసిన మూవీస్ అటు మలయాళంలోనే కాదు, ఇటు మన సైడ్ ఓటీటీల్లో కూడా బాగా గుర్తింపు తెచ్చుకున్నాయి. దీంతో ఈ మలయాళం యువ హీరో చేయబోయే తరువాతి ప్రాజెక్ట్స్ పట్ల ఇప్పుడు తెలుగు ఆడియన్స్‌కి ఇంటరెస్ట్ పెరిగింది. ప్రస్తుతం ఈ మలయాళం యువ హీరో తన నెక్స్ట్ పిక్చర్‌లో భాగంగా ఓ జెన్ జి స్టూడెంట్ లుక్ కోసం ఏకంగా 15 కేజీలు తగ్గి, మూవీస్ పట్ల తనకి ఉన్న డెడికేషన్‌ను చెప్పకనే చెప్పాడు. ‘మిన్నల్ మురళి’ మూవీ టైమ్‌లో తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ‘అరుణ్ అనిరుద్ధ్’ అనే రైటర్ తీస్తున్న ‘అతిరది’ అనే మూవీ కోసం ‘జోసెఫ్’ ఇలా సన్నగా మారినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో అతని ఫ్రెండ్స్ అండ్ సమకాలిక డైరెక్టర్స్ కమ్ యాక్టర్స్ అయిన ‘టోవినో థామస్’, ‘వినీత్ శ్రీనివాసన్’ కూడా నటిస్తున్నారు.

ఇక ‘జయ జయ జయ జయ జయహే’ చిత్రంతో అందరికీ పరిచయమైన ‘దర్శన రాజేంద్రన్’, ‘సర్వం మయమ్’ మూవీతో నవ్వులు పూయించిన క్యూట్ గర్ల్ ‘రియా శిబు’ సైతం ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. “మీసాలు, గెడ్డం తీసేస్తే స్కూల్ స్టూడెంట్… మీసాలు, గెడ్డాలు పెంచితే కాలేజీ స్టూడెంట్… అని అంటే ఈ రోజుల్లో ఎవ్వరూ నమ్మరు. ఒకోసారి క్యారెక్టర్ కోసం ఇలా శ్రమించి మన్నల్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది అని… అందుకే ఎంతో కష్టపడి ఇష్టంతో ఇలా మూవీ కోసం మేకోవర్ అయ్యా” అని జోసెఫ్ చెప్పుకొస్తున్నాడు. “దీంతో ఒక్కసారిగా నా జీన్స్ సైజు 34 నుంచి 28కి వచ్చేసింది” అని జోసెఫ్ చెప్పుకొస్తున్నాడు. నిజానికి చర్చి పాస్టర్ కొడుకుగా, ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన ఈ ‘జోసెఫ్’ అప్పట్లో తాను చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి మరి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, ముందు కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన తరువాత పెద్ద డైరెక్టర్‌గా మారి, ఇప్పుడు మాలివుడ్‌లో స్టార్ యాక్టర్‌గా దూసుకుపోతున్నాడు.