NTV Telugu Site icon

Barrelakka: నేను పవన్ ఫ్యాన్.. నాతో కంపేర్ చేయడం బాధగా ఉంది!

Barrelakka

Barrelakka

Barrelakka Responds on comparision with Janasena: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపినా జనసేన పోటీ చేసిన ఎనిమిది స్థానాలకు గాను కూకట్‌పల్లిలో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు తప్పితే.. ఎక్కడా ప్రభావాన్ని చూపలేకపోయింది. అయితే ఇదే ఎన్నికల్లో పోటీ చేసిన యూట్యూబర్‌ బరెలక్క 5 వేలకు పైగా ఓట్లు సాధించడంతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు పడినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీ అభ్యర్థులకు రాలేదు, అసలు డిపాజిట్ కూడా రాలేదు అంటూ పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు వైఎస్‌ జగన్‌.

YSRCP: మార్పులు చేర్పులపై వైసీపీ అధిష్ఠానం ఫోకస్.. నేతల్లో నెలకొన్న దడ!

ఈ క్రమంలో ఈ అంశం మీద బర్రెలక్క స్పందించారు.. ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ ఎవరి పార్టీ వారిది, ఎవరి రాజకీయ జీవితం వారిదన్నారు. పవన్ కళ్యాణ్‌ను తక్కువచేసి మాట్లాడటం బాధగా అనిపించిందని.. ‘ఆయన పవర్ ఆయనది.. నా పవర్ నాది’ నేను కూడా ఆయన అభిమానిని అని చెప్పుకొచ్చారు.. ఆయన ఎంత మంచోడో జనాలకు తెలుసు, ఆయనను తక్కువ చేసి మాట్లాడటం కోసం.. తనతో పోల్చడం బాధగా ఉందన్నారు ఆమె. పవన్ కళ్యాణ్ గ్రేట్ పర్సన్.. ఆయనను అభిమానిస్తున్నా, ఆయనను మైనస్ చేయడం కోసం తన ప్రస్తావన తీసుకురావడం సరికాదన్నారు. ఇక ప్రస్తుతం బర్రెలక్క చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Show comments