నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘డేగల బాబ్జీ’ టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో కళ్ళు మాత్రమే కనిపించేలా ముఖాన్ని కవర్ చేస్తూ కంటిపై కత్తిగాటు, దానికి వేసిన కుట్లు… ఆ గాయం నుండి కారుతున్న రక్తం సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. ఈ టైటిల్ పోస్టర్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. తమిళంలో హిట్ అయిన ‘ఓత్త సెరుప్పు సైజ్ 7’కి రీమేక్ ఇది. తమిళంలో పార్తిబన్ చేసిన పాత్రను బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం పత్యేకంగా మేకోవర్ అయ్యాడు గణేశ్. ఇప్పటికే ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంది. ఇప్పుడు ‘డేగల బాబ్జీ’ టైటిల్‌కూ మంచి స్పందన లభిస్తోందని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు దర్శకనిర్మాతలు.
డేగల బాబ్జీ’గా బండ్ల గణేష్
