NTV Telugu Site icon

Bandla Ganesh: తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు.. రౌడీ హీరోకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బండ్లన్న..?

Bandla Ganesh

Bandla Ganesh

Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి అందరికి తెల్సిందే. తన మనసుకు ఏది అనిపిస్తుందో అది ముఖం మీదనే చెప్పేస్తాడు. ఇంటర్వ్యూలో కానీ, ట్విట్టర్ లో కానీ తనకు నచ్చని విషయాన్ని ధైర్యంగా చెప్పుకొస్తాడు. ఇక సోషల్ మీడియాలో బండ్లన్న స్పీచ్ కు, ట్వీట్స్ కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా బండ్ల గణేష్ పోస్ట్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. లైగర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నెపోటిజం పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం విదితమే. “మీకు మా అయ్య తెలవదు.. మా తాత తెలవదు.. ఎవ్వడు తెలవదు..రెండేళ్లవుతోంది సినిమా రిలీజై.. ఆ ముందు రిలీజైన సినిమా పెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు..అయినా ట్రైలర్ కి ఈ రచ్చేందిరా నాయనా” అంటూ మెంటల్ మాస్ స్పీచ్ ఇచ్చాడు.

ఇక విజయ్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు.. మెగా హీరోను ఉద్దేశించే అన్నాడని పలువురు నొక్కు వక్కాణిస్తున్నారు. ఇక తాజాగా ఈ వివాదంపైనే బండ్ల గణేష్ మాట్లాడినట్లు కనిపిస్తోంది. “తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ ఖచ్చితంగా రౌడీ హీరోకే కౌంటర్ అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ ట్వీట్ పై రౌడీ హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి.

Bandla Ganesh Latest Tweet:

Show comments