NTV Telugu Site icon

Bandla Ganesh: గురూజీ విడకొట్టడంలో ఎక్స్ పర్ట్.. అంత పెద్ద మాట అనేశాడేంటీ

Pawan

Pawan

Bandla Ganesh:చిత్ర పరిశ్రమలో స్నేహాలు ఎలా ఉంటాయో.. శత్రుత్వాలు అలాగే ఉంటాయి. కొన్ని శత్రుత్వాలు బయటపడతాయి. మరికొన్ని పడవు. కొంతమంది డైరెక్ట్ గా చెప్పుకొస్తారు. ఇంకొంతమంది ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేస్తూ అక్కసు వెళ్లగక్కుతూ ఉంటారు. ఇక నిర్మాత, నటుడు బండ్ల గణేష్ – డైరెక్టర్ త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఎన్నోసార్లు బండ్లన్న.. త్రివిక్రమ్ పై అక్కసును డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా వెళ్లగక్కుతూనే ఉన్నాడు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తనను పిలవనప్పుడు.. త్రివిక్రమ్ రానివ్వలేదని, వాడు వీడు అంటూ అభిమానులతో మాట్లాడి రచ్చ చేసిన విషయం తెల్సిందే. ఆ తరువాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న బండ్లన్న మరోసారి డైరెక్ట్ గానే త్రివిక్రమ్ పై పంచ్ లు వేశాడు. నేటి ఉదయం.. ఒక అభిమాని ట్విట్టర్ ద్వారా ” బండ్లన్న నేను నిర్మాత కావాలనుకుంటున్నాను.. ఏమైనా సలహాలు ఉంటే చెప్తారా..?” అని ట్వీట్ చేస్తే.. వెంటనే బండ్లన్న.. ” గురూజీని కలిసి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వు.. పని ఐపోతోంది” అని సమాధానంచెప్పాడు . అక్కడ మొదలయ్యింది ఈ రచ్చ. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ ను గురూజీ అని పిలుస్తారు అన్న విషయం అందరికి తెల్సిందే.

Prabhas: రాముడితో రాక్షసుడు వస్తున్నాడు!

ఇక డైరెక్ట్ గానే బండ్ల.. త్రివిక్రమ్ పై పంచ్ లు వేశాడని తెలుస్తోంది. ఇక ఇంకో నెటిజన్ .. “గురూజీకి కథ చెప్తే స్క్రీన్ ప్లే రాసి దానికి తగట్టు మళ్ళీ కథను మార్చి అనుకున్న కథను షెడ్ కు పంపిస్తాడు అని టాక్ ఉంది” అని ట్వీట్ చేయగా.. దానికి బండ్ల.. “అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ” అంటూ పంచ్ వేశాడు. ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్- బండ్ల గణేష్ ను వేరుచేస్తున్నది త్రివిక్రమ్ అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఒక్క ట్వీట్ తో అది నిజమని చెప్పేశాడు బండ్ల గణేష్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఏందీ బండ్లన్న అంత మాట అనేశావ్ అంటూ పవన్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments