Site icon NTV Telugu

బండ్ల గణేశ్ హీరోగా సినిమా! అక్కడ అభిషేక్ బచ్చన్… ఇక్కడ బండ్ల గణేశ్!

Bandla Ganesh

ప్రముఖ హాస్యనటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేశ్ గత యేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో ఆర్టిస్ట్ గా రీ-ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ నుండి అడపాదడపా చిత్రాలు చేస్తున్నాడు. గురువారం విడుదలైన ‘క్రేజీ అంకుల్స్’ మూవీలో నిర్మాత పాత్రనే బండ్ల గణేశ్ పోషించాడు. తన తోటి హాస్యనటులు గతంలోనే హీరోలుగా మారినా, అలాంటి ప్రయత్నం చేయని బండ్ల గణేశ్ ఇప్పుడు హీరోగా నటించబోతున్నాడు. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ చిత్రాన్ని తెలుగులో వెంకట్ చంద్ర దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు స్వాతి చంద్ర.

Read Also : నీలకంఠ రొమాంటిక్ థ్రిల్లర్ లో రిచా పనాయ్!

‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ చిత్రానికి జాతీయ అవార్డులతో పాటు ప్రాంతీయంగానే పలు అవార్డులు దక్కాయి. విశేషం ఏమంటే.. ఈ సినిమా హిందీ రీమేక్ లో అభిషేక్ బచ్చన్ నటిస్తుండగా, దాని షూటింగ్ చెన్నయ్ లో ఈ మధ్య మొదలైంది. తెలుగు రీమేక్ గురించి దర్శకుడు వెంకట్ చంద్ర మాట్లాడుతూ, ”తమిళంలో పార్తీబన్ చేసిన పాత్రకు తెలుగులో బండ్ల గణేశ్ అయితేనే న్యాయం చేకూర్చగలడనిపించింది. ఈ పాత్ర నచ్చి ఆయన మేకోవర్ అవుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం” అని చెప్పారు.

Exit mobile version