Bandla Ganesh: నటుడు , నిర్మాత బండ్ల గణేష్ కు వివాదాలు లేకపోతే నిద్రపట్టేలా ఉండదేమో అంటున్నారు అభిమానులు. కావాలనే ఆయన వివాదాలను కొనితెచ్చుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు భక్తుడును అని పవన్ అభిమానులు బండ్లను కూడా అభిమానిస్తారు. కానీ, గత కొన్ని రోజులుగా బండ్ల ప్రవర్తనలో మార్పు వస్తోందని వారు కూడా చెప్పుకొస్తున్నారు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ నా గాడ్ అని చెప్పుకొచ్చి పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాడు. ఇక ఇప్పుడు పవన్, త్రివిక్రమ్ లపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి హాట్ టాపిక్ గా మారాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్.. పవన్ కళ్యణ్ గురించి, త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ ఫైర్ అయ్యాడు. ” పవన్ కళ్యాణ్ కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది నేను.. నిజమైన పవన్ కళ్యాణ్ ను బయటకు తీసింది నేను.. విపరీతమైన ట్యాలెంట్ ఉన్నా ఆయన అద్భుతమైన వ్యక్తి.. ఆయనకో అతీతమైన వ్యక్తి.. ఈయన వేరే స్థాయిలో ఉండాలి అని అనుకున్నది నేను. ఇప్పుడు చాలామంది గురూజీలు బరూజీలు వచ్చారు.. నాకు తెలియదు అది.. నాకు ఈరోజుకు కూడా పవన్ గారి మీద కృతజ్ఞత ఉంటుంది.. ఆ కృతజ్ఞత నా మీద వారు చూపించాలని నేను అనుకోను.” అంటూ త్రివిక్రమ్ పై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్, గురూజీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.