Bandla Ganesh: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ భక్తుడిగా బండ్లకు పవన్ ఫ్యాన్స్ లో మంచి పేరే ఉంది. నిత్యం సోషల్ మీడియా లో పవన్ గురించి ఏదో ఒక విషయాన్నీ పోస్ట్ చేయడం, పవన్ ను విమర్శించిన వారిని ఏకిపారేయడం బండ్లకు బాగా అలవాటు. వీటితో పాటు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం, అందులో మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నెట్టింట వైరల్ గా మారడం బండ్ల గణేష్ కు కొట్టిన పిండి. ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూలో మరో వివాదానికి తెరలేపాడు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో బండ్ల గణేష్ ఆడియో లీక్ ఎంతటి వివాదాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అభిమాని బండ్లన్న కు ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలని, పవన్ గురించి అద్భుతమైన స్పీచ్ ఇవ్వాలని కోరగా.. లేదమ్మ నేను రావడం లేదు. నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఆ త్రివిక్రమ్ గాడు రావద్దన్నాడు అంట.. వాడు డౌన్ అవుతానని.. మంచి డైల్జ్స్ కూడా రాసుకున్నాను.. వాడు.. త్రివిక్రమ్ నన్ను రానివ్వకుండా ప్లాన్ చేశాడు. నేను రాకపోతే అందరూ బండ్లన్న ఎక్కడ బండ్లన్న ఎక్కడ అని అరవండి.. నేను అక్కడే ఉంటా.. మీరు అరవగానే వచ్చేస్తా అని చెప్తూ త్రివిక్రమ్ ను బూతులు తిట్టాడు. ఇక ఈ ఆడియో లీక్ అయ్యాక అది తన వాయిస్ కాదని, ఎవరో మిమిక్రీ చేశారని బుకాయించాడు.
ఇక కొన్నిరోజులు హాట్ టాపిక్ గా మారిన ఈ విషయం తరువాత చల్లబడిపోయింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనదే అని చెప్పి బాంబ్ పేల్చాడు. “అవును అందులో ఉన్న వాయిస్ నాదే.. మనిషన్నాకా కోపాలు రావడం సహజం.. కోపంలో త్రివిక్రమ్ ను తిట్టింది నేనే.. ఆ తరువాత సారీ అని కూడా చెప్పాను”అని చెప్పుకొచ్చాడు. అయితే బండ్లన్న ఎక్కడ బండ్లన్న ఎక్కడ అని అరవమని చెప్పలేదని చెప్పుకొచ్చాడు. ఆ ఆడియోలో ఒక లైన్ తనదే అని మరొక లైన్ తనది కాదు అని చెప్పడంపై నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. ఆడియో మొత్తం మాట్లాడింది తనే అని ఒప్పుకొని మళ్లీ కొంతవరకు మాత్త్రం తనది కాదని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నోటి దూల ఉంటే ఇండస్ట్రీలో ఉండడం చాలా కష్టమని, బండ్ల గణేష్ ఇప్పటికైనా ఆ మాటలు అనడం మానకపోతే ఇండస్ట్రీలో తన క్రెడిబిలిటీని తానే పోగొట్టుకుంటాడని చెప్పుకొస్తున్నారు.
