NTV Telugu Site icon

Bandla Ganesh: బండ్ల గుండు బాస్ లుక్.. కళ్లన్నీ ఆ కళ్లజోడు మీదే

Bandla

Bandla

Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కొత్త లుక్ అదిరిపోయింది. గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో వేదాంతాలు చెప్తున్న బండ్ల ఇటీవలే తిరుపతి వెళ్లి తలనీలాలు స్వామివారికి సమర్పించాడు. ఇక గుండు బాస్ లుక్ లో బండ్లన్న అదరగొట్టేశాడు. తాజాగా ఆ లుక్ లో రెండు ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి. లైట్ పింక్ కలర్ కుర్తా.. కాస్ట్లీ గాగుల్స్ పెట్టుకొని చేతిలో బుక్ తో ఫొటోకు ఫోజిచ్చాడు. ఇక ఈ ఫోటోలపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. అన్నా.. శివాజీ లో రజినీకాంత్ లా ఉన్నావని కొందరు.. పుష్ప లో షెకావత్ పాత్ర నువ్వు చేయాల్సింది అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.

PM Modi: కాంతార, కెజిఎఫ్ హీరోలతో ప్రధాని.. ఫోటో వైరల్

ఇక ఈ ఫొటోలో అందరి కళ్లు బండ్లన్న పెట్టుకున్న కళ్ళజోడు మీదనే పడింది. అరే కళ్లజోడు భలే ఉందే.. అని దాని ధర ఎంత అని గూగుల్ సెర్చ్ చేయడం మొదలు పెట్టేశారు. వెర్సస్ అనే బ్రాండ్ కళ్లజోడు అది.. దాని ధర రూ. 30 వేలకు మించి ఉంటుందని తెలుస్తోంది. దీంతో అంత రేట్ ఎందుకు అన్నా.. అందులో ఏమైనా కెమెరాలు పెట్టావా అంటూ ఆటపట్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం బండ్ల.. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. నిర్మాతగా కొత్త సినిమా తీయడానికి ఒక స్టార్ హీరోను కాక పట్టే పనిలో ఉన్నాడని టాక్ నడుస్తోంది. మరి ఆ హీరో ఎవరో అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments