Site icon NTV Telugu

Bandla Ganesh: బాధపడకు బండ్లన్న.. నీకు కూడా ఒక రోజు వస్తోందిలే

Bandla

Bandla

Bandla Ganesh: నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి కానీ, ఆయన చేసే వివాదాస్పద ట్వీట్లు, వ్యాఖ్యల గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో బండ్లన్న పేరు నానుతూనే ఉంటుంది. ఇక బండ్ల.. పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడు అన్న విషయం అందరికి తెల్సిందే. కాగా, కొన్ని రోజుల నుంచి బండ్ల గణేష్ లోపల దేనికో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ఆయన పెట్టే ట్వీట్లు.. అర్ధం.. పరమార్థం.. మేధావి అంటూ బండ్ల మాట్లాడే మాటల వెనుక అర్ధం ఏంటి అనేది ఎవరికి తెలియడంలేదు. అయితే ఇన్నర్ గా బండ్ల.. పవన్ కు దూరం అవ్వడం వలనే ఈ మాటలు వస్తున్నాయి అని పవన్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. వకీల్ సాబ్ నుంచి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఫంక్షన్స్ కు బండ్ల కు పిలుపు రాలేదు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కానీ, పూజా కార్యక్రమాలకు కానీ ఆయనను పిలవలేదు. ఇక నేడు జరిగిన ఓజీ పూజా కార్యక్రమాలకు కూడా బండ్ల గణేష్ రాలేదు. అయితే త్రివిక్రమ్ వలనే ఇదంతా జరుగుతుందని బండ్ల గణేష్ చెప్పకనే చెప్పేశాడు. దీంతో దేవరను కలిసే అవకాశం లేకపోవడంతో బండ్ల ఫీల్ అవుతున్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

ఇక తాజాగా గణేష్.. “మంచి వాడు ఎప్పుడూ మొండిగా నే ఉంటాడు ఎందుకంటే వాడికి నటించడం రాదు కాబట్టి”, విజయం అనేది ఆలస్యంగా లభించే ఓటమి.. ఓటమి కూడా ఆలస్యంగా లభించే విజయం.. ఓటమి ముగింపు కాదు.. విజయం శాశ్వతం కాదు”, ” ఉన్నది ఉంటుంది లేనిది ఎప్పుడూ ఉండదు. దేనీని పట్టి ఉంచుకోవాలి దేనీని విడిచి పెట్టాలో తెలిసిన వాడే అసలైన మేధావి” అంటూ వరుస ట్వీట్స్ చేశాడు. ఇక ఈ ట్వీట్స్ కూడా ఆయన బాధను చెప్పకనే చెప్తున్నాయి. దీంతో నెటిజన్లు.. అభిమానం ఉంటే వాళ్లే పిలుస్తారు లే, అంతే గాని ఇలా ఎదో ఒకటి వేసి పిలిపించుకోకు ఇజ్జతి పోతది అని కొందరు.. బాధపడకు బండ్లన్న.. నీకు కూడా ఒక రోజు వస్తోందిలే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version