ఒక రీమేక్.. ప్లాప్స్ లో ఉన్న స్టార్ హీరో.. ఐరన్ లెగ్ అనిపించుకున్న హీరోయిన్ .. అప్పుడే ఎదుగుతున్న డైరెక్టర్.. నటుడిగా సంపాదించుకున్న డబ్బునంతా ఈ సినిమాపై పెట్టిన నిర్మాత.. ఇంతమంది జీవితాలు ఒకే ఒక్క సినిమాపై ఆదాహారపడి ఉన్నాయి. హిట్ అయితే వీరందరూ తమ పేరును సార్ధకం చేసుకుంటారు.. అవ్వకపోతే మరో ప్లాప్ ను అందుకుంటారు అని ప్రేక్షకుల విమర్శలు.. ఇవేమి పట్టించుకోకుండా అందరు కలిసి తమ సినిమాపై నమ్మకంతో 2012, మే 11 న రిలీజ్ చేశారు.. అది హిట్ కాదు.. భారీ హిట్ అయ్యి కూర్చోంది. రికార్డుల సునామి సృష్టించింది.. ఒక చరిత్రను తిరగరాసింది. ఆ సినిమానే గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నిర్మించాడు.
ఇక ఈ సినిమా తాజాగా పదేళ్లు పూర్తిచేసుకుంది. దీంతో హరీష్ శంకర్- బండ్ల గణేష్ మరోసారి కలిశారు. అయితే వీరి ఆమధ్య గత కొన్నిరోజుల క్రితం పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న విషయం విదితమే. ట్విట్టర్ వేదికగా ఇద్దరు మాటల యుద్ధం చేసుకున్నారు. కానీ, రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం ఉండదు అన్నట్లు తమ సినిమా పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వీరు కలిసి అభిమానులనకు షాక్ ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా బండ్ల గణేష్, హరీష్ శంకర్ కు ఖరీదైన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక గొడవలు సద్దుమణిగాయి కాబట్టి ఈ కాంబోలో మరో సినిమాను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ తో `భవధీయుడు భగత్ సింగ్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి వీరి కాంబో ఫ్యూచర్ లో సెట్ అవుతుందేమో చూడాలి.
🙏🙏🙏🙏🙏🙏 thank you sir https://t.co/SjhswhfaSs
— BANDLA GANESH. (@ganeshbandla) May 11, 2022
