NTV Telugu Site icon

Bandla Ganesh : బండ్ల గణేశ్ సంచలన పోస్టు.. అతడిని ఉద్దేశించేనా..?

Bandla Ganesh

Bandla Ganesh

Bandla Ganesh : బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ ను ఎవరైనా ఒక్క మాట అన్నా సరే వెంటనే కౌంటర్ ఇచ్చేస్తుంటారు. పవన్ కల్యాణ్‌ కు తాను భక్తుడిని అని ఎన్నోసార్లు ప్రకటించుకున్నారు. నిత్యం పవన్ గురించి ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంటారు. అలాంటి బండ్ల గణేశ్ తాజాగా ఓ సంచలన పోస్టు చేశారు. నిన్న పవన్ కల్యాణ్‌ పిఠాపురం సభలో మాట్లాడుతూ హిందీ భాషను వద్దంటే కుదరదు అని తెగేసి చెప్పేశారు.

Read Also : Ambati Rambabu: చిరంజీవి తమ్ముడు కాకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?

దానిపై ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ వేశారు. బహుభాషా విధానం వద్దు అనడం అంటే.. ఇంకో భాషను ద్వేషించడం కాదని.. తమ మాతృ భాషను కాపాడుకునే ప్రయత్నమేనని.. ఈ విషయాన్ని పవన్ కు ఎవరైనా చెప్పాలంటూ రాసుకొచ్చారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేసిన గంటలోపే బండ్ల గణేశ్ ఓ ట్వీట్ చేశారు. “కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే.” ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి” అంటూ రాసుకొచ్చారు. బండ్ల చేసిన ఈ ట్వీట్ ప్రకాశ్ రాజ్ ను ఉద్దేశించిందే అని కామెంట్లు వస్తున్నాయి. గతంలో ప్రకాశ్ రాజ్ కోసం పవన్ ఎంత చేశారో బండ్ల గుర్తు చేశాడని అంటున్నారు.