Bandla Ganesh : బండ్ల గణేశ్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఆయన ఏ స్టేజ్ ఎక్కినా సరే రచ్చ రచ్చే. ఆయన చేసే కామెంట్లు ఇండస్ట్రీలో తుఫాన్ సృష్టిస్తున్నాయి. రీసెంట్ గా బండ్ల ఓ ఈవెంట్ కు వెళ్లినప్పుడు బండ్ల గణేశ్ ఒక ప్లాప్ తర్వాత సినిమాలు తీయట్లేదని.. త్వరలోనే రావాలని నిర్మాత ఎస్కేఎన్ అన్నాడు. దానికి బండ్ల రిప్లై ఇస్తూ.. తాను బ్లాక్ బస్టర్ మూవీ తర్వాతనే సినిమాలకు గ్యాప్ ఇచ్చానని.. త్వరలోనే స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నట్టు చెప్పాడు. ఇంకేముంది రకరకాల కథనాలు వచ్చేశాయి. చిరంజీవితో సినిమా చేస్తున్నాడని.. పవన్ కల్యాణ్ తో మూవీ ఉంటుందంటూ రకరకాల వార్తలు వచ్చేశాయి.
Read Also :SSMB 29 : బాహుబలి రేంజ్ లో సెట్ వేయిస్తున్న రాజమౌళి..
ఈ వార్తలపై తాజాగా బండ్ల గణేశ్ రియాక్ట్ అయ్యాడు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించట్లేదు. నేను ప్రొడ్యూసరగా చేస్తున్నట్టు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు రాసి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ రాసుకొచ్చాడు బండ్ల. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అసలు బండ్లను ఎవరు ఇబ్బంది పెట్టారంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో.. అసలు నువ్వు ఎవరితో సినిమా తీస్తావో ముందు చెప్పు అంటున్నారు. బండ్ల గణేశ్ మాత్రం వరుస మూవీల ఈవెంట్లకు వస్తూ బిజీగా ఉంటున్నాడు. ఎక్కడకు వచ్చినా మంచి స్టఫ్ ఇచ్చి వెళ్తున్నాడు.
Read Also : JIGRIS : జిగ్రీస్ మూవీ నుంచి మీరేలే సాంగ్ రిలీజ్..
