యంగ్ హీరో సుశాంత్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. ఈ చిత్రం ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి “బండి తియ్” అనే సూపర్ మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈ సాంగ్ ను రిలీజ్ చేసి చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ మేరకు చిత్రబృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మాస్ బీట్ “బండి తియ్” సాంగ్ ను సింగర్, బిగ్ బాస్ తెలుగు -3 విన్నర్ రాహుల్ సింప్లిగంజ్ పాడారు. సురేష్ గంగుల లిరిక్స్ అందించారు. ప్రవీణ్ లక్కరాజు ఈ మూవీకి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మరో “హే మనసెందుకిలా” సాంగ్ కు ప్రేమికుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన “బండి తియ్” సాంగ్ మాత్రం మాస్ దృష్టిని ఆకర్షిస్తోంది.
Read Also : జాన్వీ స్టైల్ లో ఎక్స్ పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ !
ఈ చిత్రానికి ఎస్ దర్శన్ దర్శకత్వం వహించారు. ఏఐ స్టూడియోస్ అండ్ శాస్త్రా మూవీస్ బ్యానర్‌ల కింద రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కొయ్యలగుండ్ల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చారు. ఈ సినిమాతో బాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ మూవీ కథ వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందింది. ఈ చిత్రం ఒక నవల కాన్సెప్ట్‌తో విలక్షణమైన థ్రిల్లర్‌గా రూపొందింది.
ఇక సుశాంత్ విషయానికొస్తే… ఈ యంగ్ హీరో చివరగా “చిలసౌ” చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా అతనికి మంచి విజయాన్ని అందించింది. అయితే సినిమా సినిమాకు చాల వ్యాప్ తీసుకుంటున్నాడు. కానీ కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. బన్నీ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురంలో” సరికొత్త పాత్రలో అమాయకంగా కన్పించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అంటూ టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఈ చిత్రంతో సుశాంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
