NTV Telugu Site icon

Balayya: ‘ఆహా’ అనగానే ఎదో ఎనర్జీ వచ్చేస్తుంది బాలయ్యకి… ఈసారి ‘ర్యాప్’ ఆడేసాడు

Idol Balayya

Idol Balayya

తెలుగు డెడికేటెడ్ ఒటీటీ ‘ఆహా’కి ఆకాశాన్ని తాకే క్రేజ్ తెచ్చాడు ‘నట సింహం నందమూరి బాలకృష్ణ’. ఆహాకి బాలయ్య ఎంత హెల్ప్ అయ్యాడో, బాలయ్యకి కూడా ఆహా అంతే హెల్ప్ అయ్యింది. ఈరోజు బాలయ్య ఇమేజ్ చేంజ్ అయ్యి, ఆయన గురించి ప్రతి ఒక్కరు పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు అంటే దానికి కారణం ‘ఆహా’నే. ఆహా కోసం ‘అన్-స్టాపబుల్’ టాక్ షో చేసి, టాక్ షోల చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించాడు బాలయ్య. తాజాగా మరోసారి బాలయ్య ఆహా వేదికపై కనిపించాడు. అయితే ఈసారి టాక్ షో కోసం కాదు సింగింగ్ షో కోసం. ఆహాలో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 2’ జరుగుతుంది. తమన్, గీత మధురి, సింగర్ కార్తీక్ లు జడ్జ్ లుగా టెలికాస్ట్ కానున్న ఈ షోకి ఫస్ట్ ఎపిసోడ్ నుంచే క్రేజ్ తీసుకోని రావాలి అనుకున్న ఆహా టీం, బాలయ్యని రంగంలోకి దించారు. సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొనబోతున్న 12 మంది కాంటెస్టెంట్ లని ఇంట్రడ్యూస్ చేస్తూ బాలయ్య ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’ని స్టార్ట్ చేస్తున్నాడు.

ఈ లాంచ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ‘గాలా విత్ బాలా’ అనే ట్యాగ్ తో బయటకి వచ్చిన ప్రోమోలో బాలకృష్ణ ‘మైఖేల్ జాక్సన్’ రేంజులో స్టెప్పులు వెయ్యడమే కాదు, మైక్ అందుకోని మంచి ర్యాప్ పాట కూడా పాడేసాడు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 సెమిస్ కి వచ్చి బాలయ్య చేసిన సందడిని ఎవరూ మర్చిపోయి ఉండరు. అప్పుడు సెమిస్ కి చేసిన సందడిని మించి సీజన్ 2 లాంచ్ ఎపిసోడ్ లో చూపించడానికి బాలయ్య రెడీ అయ్యాడు. ర్యాప్ సాంగ్ ని బాలయ్య పాడిన విధానం చూస్తే, ఆయన ఎలాంటి ఆలోచనలు లేకుండా జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాడు అనిపించక మానదు. మరి ఫుల్ లెంగ్త్ ఎపిసోడ్ లో బాలయ్య ఇవ్వబోయే ఫన్ ఎలా ఉంటుందో చూడాలి అంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Show comments