NTV Telugu Site icon

NTR: తారక్ మాటే నా మాట అంటున్న బాలయ్య..

Bala

Bala

NTR: నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడ ఉంటే సందడి అక్కడే ఉంటుంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఏ ఈవెంట్ కి వచ్చి నా అక్కడ అంతా బాలయ్య గురించే మాట్లాడుకునేలా చేస్తాడు. ఇక గత రాత్రి బాలకృష్ణ రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన స్కంద ప్రీ రిలీజ్ థండర్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఈవెంట్లో రామ్ ను టీజ్ చేసిన బాలయ్య.. సినిమా గురించి, బోయపాటి శ్రీను గురించి తనదైన శైలిలో మాట్లాడి ఆకట్టుకున్నాడు. ఇక చివర్లో బాలకృష్ణ నోటివెంట తారక్ మాట రావడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదేంటి బాబాయి నోట.. అబ్బాయి మాట.. ఏంటి?.. ఎప్పుడు బాలకృష్ణ, తారక్ గురించి మాట్లాడడు కదా అనుకుంటున్నారా.. అదేమీ కాదు.. నందమూరి కుటుంబంలో రోడ్డు ప్రమాదాల వలన చనిపోయినవారు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ తండ్రి, అన్న కారు ప్రమాదంలోనే మృతి చెందారు.

BRO : ఓటీటీ లో అదరగొడుతున్న పవర్ ప్యాక్డ్ మూవీ..

ఇక దీంతో హరికృష్ణ చనిపోయిన దగ్గర నుంచి ఎన్టీఆర్ ప్రతి ఈవెంట్ చివర్లో ప్రేక్షకులకు జాగ్రత్త చెబుతూ ఉంటాడు. జాగ్రత్తగా వెళ్లాలి అని, హెల్మెట్ పెట్టుకోవాలి అని, నిదానంగా వాహనాలని నడపాలని, ఇంటి దగ్గర మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారని, తనకు తన కుటుంబం ఎంతో అభిమానులు కూడా అంతే ముఖ్యమని.. అభిమానులపై ఎనలేని ప్రేమను చూపిస్తూ ఉంటాడు. ఇక అవే మాటలను రాత్రి బాలయ్య నోట విన్నారు అభిమానులు.

Bhairava Dweepam: బాలయ్య – రోజా రొమాన్స్.. మళ్లీ ఇన్నేళ్ల తరువాత.. ?

ఇక ఈ ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ ” ఇంత దూరం నుంచి వచ్చారు అభిమానులంతా కూడా నా అభిమానులు అయితే ఏమి రామ్ అభిమానులు అయితే ఏమి.. ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వాళ్లందరికీ కూడా థాంక్స్ బయట వాళ్ళ నుంచి కూడా వచ్చినట్లు ఉన్నారు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అక్కడ చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నందమూరి అభిమానులు తారక్ మాటనే తన మాటగా బాలయ్య చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని, తారక్ చెప్పిన మాటలను బాలయ్య చెప్పడం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎంతైనా బాబాయ్.. బాబాయ్ అంతే అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments